Multan Test | ముల్తాన్: పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య ముల్తాన్లో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకుంటున్న ఈ టెస్టులో విండీస్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్.. 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి మరో 178 పరుగులు అవసరం కాగా విండీస్ గెలిచి సిరిస్ సమం చేయాలంటే మరో 6 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.
ఛేదనలో పాక్ సారథి షాన్ మసూద్ (2)తో పాటు మరో ఓపెనర్ హరేరియా (2), కమ్రాన్ గులామ్ (19) విఫలమవగా బాబర్ ఆజమ్ (31) ఫర్వాలేదనిపించాడు.