ఝాన్సీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో హాకీ క్రీడకు ప్రాధాన్యం పెరిగింది. గురువారం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వేదికగా 11వ సీనియర్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్ ప్రారంభమవుతున్నది. ఈ టోర్నీలో తెలంగాణ సహా మొత్తం 28 జట్లు పోటీపడుతున్నాయి. తొలుత లీగ్ మ్యాచ్‌లతో మొదలై ఈనెల 27న క్వార్టర్స్, 29, 30 తేదీల్లో సెమీస్, ఫైనల్స్ జరుగనున్నాయి. పూల్-జిలో ఉన్న తెలంగాణ తమ తొలి మ్యాచ్‌లో మిజోరాంతో తలపడుతుంది.