Rohit Sharma | టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచి భారత్‌కు వస్తే 140 కోట్ల మంది భారతీయులు తమను స్వాగతిస్తారని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ వాఖండే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించింది. రోహిత్ శర్మతో పాటు దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, అజింక్య రహానే వంటి స్టార్ ఆటగాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ చాంపియన్స్ ట్రోఫీ గురించి స్పందించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారీగా అభిమానులు స్వాగతించారని గుర్తు చేశాడు.
#WATCH | Wankhede Stadium’s 50th anniversary: Maharashtra | Ahead of the ICC Champions Trophy 2025, Indian Men’s cricket team captain Rohit Sharma says, “We will try our best. It is always a dream to represent the Indian team in any ICC trophy. We will embark on another dream. I… pic.twitter.com/RmK3pKJdA8
— ANI (@ANI) January 19, 2025
పాక్, దుబాయి వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీని గెలిచి.. అభిమానులకు మరోసారి అదే అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రపంచకప్ గెలుపొందడం ఒక విషయమని.. దాన్ని ప్రజలతో కలిసి సంబురాలు జరుపుకోవడం మరొక విషయమని తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీని గెలిచి మళ్లీ వాంఖడే మైదానానికి తీసుకువస్తామని ప్రయత్నిస్తామని రోహిత్ హామీ ఇచ్చాడు. దుబాయికి వెళ్లిన సమయంలో 140 మంది ప్రజల ఆశీస్సులు తమ వెంట ఉంటాయని తనకు తెలుసునని.. ట్రోఫీని గెలిచి మళ్లీ వాంఖడేకు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పాడు.
ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ వాంఖడేతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్టేడియానికి వెళ్లినప్పుడల్లా సొంత మైదానంలో ఉన్నట్లు భావిస్తానని చెప్పాడు. 1974లో వాంఖడే స్టేడియం నిర్మించినప్పుడు.. మా డ్రెస్సింగ్ రూమ్ కింద ఉండేదని.. ప్రాక్టీస్ సెషన్ కోసం తాము మొదటిసారి మైదానంలోకి అడుగుపెట్టామంటూ గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు బ్రబోర్న్ స్టేడియంలో ఆడేవారమని.. కానీ, వాంఖడేకు వచ్చినప్పుడు ముంబయి క్రికెట్‌కు హోంగ్రౌండ్ అనిపించిందని.. మ్యాచుల సందర్భంగా కామెంటేటరి కోసం వచ్చినప్పుడు.. నా ఛాతి గర్వంతో ఉప్పొంగుతుందన్నారు.
#WATCH वानखेड़े स्टेडियम की 50वीं वर्षगांठ | महाराष्ट्र: दिग्गज क्रिकेटर सचिन तेंदुलकर ने कहा, “मेरे आखिरी मैच की श्रृंखला की घोषणा होने से पहले – मैंने BCCI से संपर्क किया और अनुरोध किया कि मैं चाहता हूं कि मेरा आखिरी मैच मुंबई में एक ही कारण से आयोजित हो – मैंने इतने सालों तक… pic.twitter.com/YkCMpKLizl
— ANI_HindiNews (@AHindinews) January 19, 2025
టీమిండియా లెజెండ్ ఆటగాడు సచిన్ సైతం జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. 2013లో వెస్టిండిస్‌తో చివరి టెస్టు ఆడానని తెలిపాడు. వెస్టిండీస్‌తో సిరీస్ షెడ్యూల్ ప్రకటించినప్పుడు.. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి సిరీస్‌లోని రెండో, చివరి మ్యాచ్ వాంఖడేలో ఆడవచ్చా? అని అడిగానని.. ఎందుకంటే తన తల్లి చివరి మ్యాచ్‌ను చూడాలని కోరుకున్నట్లు తెలిపాడు. అంతకు ముందు తన తల్లి ఎప్పుడూ స్టేడియానికి రాలేదని.. తాను ఆడడం చూడలేదని చెప్పాడు. తన కోరికను బీసీసీఐ మన్నించిందని.. తల్లితో పాటు మొత్తం కుటుంబం ఆ రోజు వాంఖడేలో ఉందని తెలిపారు. ఆ రోజు వాంఖడేలోకి తాను అడుగుపెట్టిన సందర్భంలో అనుభవించిన అనుభూతి, భావాలే ఇప్పుడూ అనుభవిస్తున్నానని సచిన్ పేర్కొన్నాడు.