న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్ 13 మంది భారత పారా షట్లర్లు అర్హత సాధించారు. వీరిలో మాజీ చాంపియన్ కృష్ణనాగర్ కూడా చోటు దక్కించుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్ఐ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీలో మన షట్లర్లు తొమ్మిది వేర్వేరు విభాగాల్లో బరిలోకి దిగనున్నారు. నాగర్ మరోమారు స్వర్ణం సాధించేందుకు పట్టుదలతో ఉన్నాడు.