ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్(91: 50 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), దీపక్ హుడా(64: 28 బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆరంభంలో విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(40: 28 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ మధ్య ఓవర్ల నుంచి చేతులెత్తేసి పరుగులు భారీగా సమర్పించుకుంది. చేతన్ సకారియా ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ మోరీస్ 2 వికెట్లు తీసినా ధారళంగా పరుగులు ఇచ్చాడు.
హుడా సంచలన బ్యాటింగ్ మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది. ఈ సీజన్లోనే అత్యంత వేగవంతమైన
హాఫ్‌సెంచరీ(20 బంతుల్లోనే) నమోదు చేశాడు. ఇన్నింగ్స్ ఆద్యంతం సిక్సర్లతో డీల్ చేశాడు. శివమ్ దూబే వేసిన 13వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన హుడా శ్రేయస్ గోపాల్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో వరుసగా రెండు ఓవర్లలో పంజాబ్ 20 రన్స్ రాబట్టింది. రాహుల్, హుడా మూడు వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీ జోరుకు 14 ఓవర్లకే పంజాబ్ 150 మార్క్ దాటింది. క్రిస్ మోరీస్ వేసిన 18వ ఓవర్లో హుడా భారీ షాట్‌కు ప్రయత్నించగా లాంగాన్‌లో రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్(0) ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. సెంచరీ దిశగా దూసుకెళ్లిన రాహుల్ సకారియా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వెనుదిరిగాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(14) విఫలమయ్యాడు.
.@klrahul11's fantastic knock comes to an end on 91.
— IndianPremierLeague (@IPL) April 12, 2021
Live – https://t.co/PhX8FyJiZZ #RRvPBKS #VIVOIPL pic.twitter.com/bkXP6vVdBt
Hooda departs after a quick-fire innings of 64 off 28 deliveries 👌👌
— IndianPremierLeague (@IPL) April 12, 2021
Live – https://t.co/WNSqxSOXpd #RRvPBKS #VIVOIPL pic.twitter.com/7trTNPbPYV