ముల్హీమ్: జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లలో భాగంగా జార్జి.. 21-18, 19-21, 21-16తో ఓల్డార్ఫ్ (ఫిన్లాండ్)ను ఓడించాడు.
రజావత్.. 21-14, 21-14తో భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్‌ను చిత్తుచేశాడు. తరుణ్ మన్నెపల్లి.. 10-21, 21-19, 21-19తో జొనాసెన్ (డెన్మార్క్)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో అన్మోల్ ఖర్బ్ ఓటమిపాలవగా ఉన్నతి హుడా, రక్షిత విజయాలు సాధించారు.