ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి | సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లబ్ధిదారులకు స్థానిక కొండా భూదేవి గార్డెన్స్‌లో సోమవారం మంత్రి హరీశ్ రావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లబ్ధిదారులకు స్థానిక కొండా భూదేవి గార్డెన్స్‌లో సోమవారం మంత్రి హరీశ్ రావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏండ్లుగా ఇళ్ల పట్టాలు లేనివారికి భద్రత కల్పిస్తూ పట్టాలు అందించామని తెలిపారు.
కరోనా విజృంభిస్తున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 45 ఏండ్లు దాటినా వారు కొవిడ్ టీకా తీసుకోవాలని కోరారు.
తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనానికి ఇవ్వాలన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీని స్వచ్ఛతకు చిహ్నంగా నిలపాలని సూచించారు.
ప్రభుత్వ దవాఖానలో అన్నిసదుపాయాలున్నాయని, సేవలను వినియోగించుకోవాలన్నారు. కోమటి చెరువు వద్ద మూడు రోజుల పాటు లేక్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా డైరెక్టర్లు బర్ల మల్లికార్జున్, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, తాసిల్దార్ విజయ్, డిప్యూటీ తాసిల్దార్ రాజేశం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

