గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 27, 2021 , 00:50:04

హుస్నాబాద్‌కు కొత్త రూపు..

హుస్నాబాద్‌కు కొత్త రూపు..

గల్లీగల్లీనా సీసీ రోడ్లు

అభివృద్ధిలో దూసుకుపోతున్నహుస్నాబాద్‌ మున్సిపాలిటీ

గడిచిన ఏడాదిలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు 

పట్టణంలో అన్ని కాలనీల్లో పూర్తయిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు

నిత్యం ఇంటింటికీ ‘మిషన్‌ భగీరథ’ నీటి సరఫరా

ప్రధాన కూడళ్ల ఆధునీకరణకు ప్రతిపాదనలు

హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం : ఆకుల రజిత వెంకట్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ 

హుస్నాబాద్‌, జనవరి 26: రెవెన్యూ డివిజనల్‌ కేంద్రంగా, మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్న హుస్నాబాద్‌ పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఒకప్పుడు మారుమూల పట్టణంగా ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పట్టణం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దినదినాభివృద్ధి చెందుతున్నది. హుస్నాబాద్‌ మున్సిపాలిటీ మొదటి ఎన్నికలు 2015లో జరుగగా, రెండోసారి 2020 జనవరిలో జరిగాయి. రెండో పాలకవర్గం బాధ్యతలు స్వీకరించి ఏడాది గడుస్తోంది. ఈ ఏడాదిలో మంత్రులు కేటీఆర్‌, తన్నీరు హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ సహకారంతో చైర్‌పర్సన్‌ ఆకుల రజితవెంకట్‌ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు పూర్తికాగా, మరికొన్ని ప్రగతిలో ఉన్నాయి. 

ఏడాదిలో రూ.12 కోట్లతో అభివృద్ధి

హుస్నాబాద్‌ పట్టణంలో గడిచిన ఏడాదిలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని పనులు చివరిదశలో ఉన్నాయి. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు మారుమూల కాలనీల్లో కూడా నిర్మించారు. ఇంకా డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల పనులు పూర్తయ్యాయి. మిషన్‌ భగీరథ నీరు పట్టణంలోని దాదాపు అన్ని కాలనీలకు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని దాదాపు అన్ని కులాల వారికి కమ్యూనిటీ భవనాల కోసం నిధులు మంజూరయ్యాయి. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించడంతో పాటు పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిత్యం చెత్త సేకరణ పకడ్బందీగా చేపడుతున్నారు. కూరగాయల మార్కెట్‌కు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమైంది. 

పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు 

హుస్నాబాద్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు చైర్‌పర్సన్‌ రజితవెంకట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పట్టణంలోని యువతకు అందుబాటులో ఉండే విధంగా రెండు ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు, అంబేద్కర్‌ చౌరస్తాతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లను ఆధునీకరించి ట్రాఫిక్‌ వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పట్టణంలోని పలు ప్రధాన రహదారుల్లో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం.. 

ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌, మం త్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సహకారంతో రాబోయే రోజుల్లో హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే నిపుణులతో పలు ప్రతిపాదనలను సిద్ధం చేశాం. మంత్రు లు, ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను, చేయబోయే పనులను ఎప్పటికప్పుడు తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాం. కూడళ్లను ఆధునీకరించడం ద్వారా పట్టణ రూపురేఖలు మారుతా యి. ప్రజలకు మౌలి సదుపాయాల కల్పనకు ప్రా ధాన్యమిస్తున్నాం. పట్టణాన్ని అన్నిరంగా ల్లో అబివృద్ధి చేసేందుకు మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు, పట్టణ ప్రముఖులు, నాయకుల సహకారంతో కృషిచేస్తాం.

-ఆకుల రజిత వెంకట్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, హుస్నాబాద్‌

VIDEOS

logo