శనివారం 06 మార్చి 2021
Siddipet - Dec 15, 2020 , 00:10:20

సత్వర న్యాయానికి ‘కమిషన్‌' పర్యటన

సత్వర న్యాయానికి ‘కమిషన్‌' పర్యటన

సిద్దిపేట కలెక్టరేట్‌/ సంగారెడ్డి: మూడు రోజుల పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పర్యటించనున్నది. దళిత గిరిజన హక్కుల పరిరక్షణ కోసం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సత్వర న్యాయం జరిగే విధంగా జన అదాలత్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కమిషన్‌ కోర్టును ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నది. జిల్లాలో కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. కాగా, జన అదాలత్‌ పోస్టర్‌ను సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్‌ క్యాంపు కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోసం సంగారెడ్డి జిల్లాకు కమిషన్‌ చైర్మన్‌ సభ్యులు రానున్నట్లు సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని, అలాగే జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.


VIDEOS

logo