శుక్రవారం 04 డిసెంబర్ 2020
Siddipet - Oct 25, 2020 , 00:12:20

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం

నంగునూరు/చిన్నకోడూరు: సీఎం కేసీఆర్‌ రైతులకు ఇబ్బందులు లేకుండా మక్కలు కొనుగోలు చేస్తామని నిర్ణయించడం సంతోషకరమని నం గునూరు మండల రైతుబంధు కో-ఆర్డినేటర్‌ బద్దిపడగ కిష్టారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ సోంరెడ్డి, చిన్నకోడూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌ అన్నారు. శనివారం నంగునూరు మండలం గట్లమల్యాల, చిన్నకోడూరులో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఉమేశ్‌చంద్ర, తిప్పని రమేశ్‌, ఉప సర్పంచ్‌ ప్రకాశ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు రమేశ్‌, నాయకులు వేణు, గ్రామ కో-ఆర్డినేటర్‌ నరేశ్‌, రవీంద్రచారి, భాస్కర్‌రెడ్డి, తిరుపతి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.