గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 18, 2020 , 01:17:54

లక్ష మెజార్టీయే లక్ష్యంగా ముందుకెళ్లాలి

లక్ష మెజార్టీయే లక్ష్యంగా ముందుకెళ్లాలి

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిపించుకోవాలి

కార్యకర్తల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతున్నది.., ఉద్యమాల గడ్డ అయిన దుబ్బాక నియోజకవర్గంలో పార్టీ శ్రేణులంతా ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తూ ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకుంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న ప్రగతికి పల్లెలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలు తమ ఓటు కారుగుర్తుకేనని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. పల్లెల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా గులాబీ గూటికి చేరుతున్నారు. ఉప పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట  సుజాతను గెలిపించుకుని లింగన్న ఆశయాలను కొనసాగిస్తామని చాటిచెబుతున్నారు.

చేగుంట: “తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి.” అని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం నార్సింగి మండల కేంద్రంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సంఘంలో, చేగుంట సాయిబాలాజీ గార్డెన్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నార్సింగి సమావేశానికి హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సీమాంధ్ర పాలనలో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. చేగుంట సమావేశంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌ పాల్గొని మాట్లాడారు. ఆయా సమావేశాల్లో నార్సింగి, చేగుంట సమావేశాల్లో ఎంపీపీలు చిందం సబిత, మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీలు బాణపురం కృష్ణారెడ్డి, ముదాం శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు తౌర్యనాయక్‌, తాడెం వెంగళ్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీణ్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నం రాజేందర్‌రెడ్డి, రైతు సంఘం మండలాధ్యక్షుడు లింగారెడ్డి, వైస్‌ ఎంపీపీలు సుజాత, మున్నూర్‌ రాంచంద్రం, ఎంపీటీసీలు సత్యనారాయణ, అయిత వెంకటలక్ష్మీ, డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌ సండ్రుగు స్వామి, సొసైటీ చైర్మన్లు వంటరి కొండల్‌రెడ్డి, మ్యాకల పరమేశ్‌, నాయకులు నారాయణరెడ్డి, రాజిరెడ్డి, హరికృష్ణ, మాజీ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఆకుల మల్లేశంగౌడ్‌, శ్రీపతిరావ్‌, నర్సింహచారి, కుమ్మరి బాబు, నర్సింహులు, రాజేష్‌ తదితరులు వేర్వేరుగా పాల్గొన్నారు.


VIDEOS

logo