ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 01, 2020 , 03:28:37

వ్యవసాయంలో గుణాత్మక మార్పులు

వ్యవసాయంలో గుణాత్మక మార్పులు

  •  గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి
  •  రైతు వేదిక నిర్మాణాలకు స్థలాల పరిశీలన 

 కొండపాక : వ్యవసాయ రంగంలో గుణాత్మక మార్పులు రావా లని గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి పేర్కొన్నారు. సాగులో వచ్చే మార్పులపై చర్చించుకోవడానికి రైతులు సమావేశం కావడానికి క్లస్టర్ల పరిధి లో రైతు వేదికను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని మేథినిపూర్‌లో మంగళవారం రైతుబంధు రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీరవీందర్‌తో కలిసి రైతు వేదిక నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. స్థల పరిశీలనలో ఏడీఏ అనిల్‌కుమార్‌, తహసీల్దార్‌ పరమేశ్వర్‌, ఏవో ప్రభాకర్‌రావు, ఏఈ లింగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ దుర్గయ్య, నాయకులు రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

గజ్వేల్‌/ గజ్వేల్‌ రూరల్‌ : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయ మని గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని అహ్మదీపూర్‌, పిడిచెడ్‌, బయ్యారం, కొమటిబండ, శ్రీగిరిపల్లి, అక్కారం, కొడకండ్ల తోపాటు గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలో రైతు వేదికల నిర్మాణానికి స్థలాలను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితిలో కూడా రైతులకు రైతుబంధు అమలుతోపాటు రుణమాఫీ చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు పంటల సాగు లో నూతన పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించాలన్నా రు. అలాగే, వ్యవసాయంలో వ చ్చే మార్పులు స్వీకరించాల న్నా రు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అ మలు చేస్తున్న రైతు సంక్షేమ ప థకాలు దేశానికి ఆదర్శంగా మా రాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, ఏవో నాగరాజు, రైతుబంధు సమితి మండల కో ఆర్డి నేటర్‌ రాజిరెడ్డి పాల్గొన్నారు. 


logo