బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 07, 2020 , 00:18:04

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉందాం

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉందాం

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు : సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. పటాన్‌చెరు  డివిజన్‌లో పారిశుధ్యం పనులను వేగవంతం చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రతి వీధిలో శానిటైజింగ్‌ పనులు చేయాలన్నారు. నగరంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని, మన ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు అందరం శ్రమిద్దామన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి డివిజనల్‌ ఒక జేసీబీ, 4 టిప్పర్లతో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ బాలయ్య, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. శనివారం పటాన్‌చెరు పట్టణంలోని  చైతన్యనగర్‌కాలనీ, గౌతంనగర్‌ సీతారామయ్య కాలనీ, అంబేద్కర్‌ కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. చైతన్యనగర్‌ కాలనీలో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సీలాతారామయ్య వెంచర్‌లో అంతర్గత మురుగునీటి పైప్‌లైన్లు చిన్నవిగా ఉన్నాయని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే నూతన పైప్‌లైన్‌ వేయిస్తామని హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, నాయకులు విజయ్‌కుమార్‌ ఉన్నారు.  logo