ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ త్వరలో వీడియో కింద కనిపించే డిస్లైక్ కౌంట్‌ను హైడ్ చేయనున్న విషయం తెలిసిందే. మామూలుగా ఎవరైనా యూట్యూబ్ వీడియో చూశాక ఆ వీడియో నచ్చితే లైక్.. లేకపోతే డిస్లైక్ చేస్తారు. అయితే.. కావాలని కొన్ని గ్రూప్స్.. కొందరు యూట్యూబ్ క్రియేటర్ల వీడియో డిస్‌లైక్స్ కౌంట్‌ను పెంచుతున్నాయి.
దీనిపై యూట్యూబ్ చాలాసార్లు రివ్యూ చేసింది. ఇదివరకు కూడా ఒకసారి డిస్లైక్ బటన్‌ను తీసేయాలని యూట్యూబ్ భావించింది కానీ.. యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని విరమించుకుంది. పబ్లిక్ డిస్లైక్ కౌంట్‌ను ప్రైవేట్‌గానూ మార్చి ఎక్స్పరిమెంట్ చేసింది. దీంతో డిస్లైక్ కౌంట్స్ చాలామటకు తగ్గాయి. దీంతో తాజాగా.. పబ్లిక్ డిస్లైక్ కౌంట్‌ను కనిపించకుండా చేసే ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. డిస్లైక్ కౌంట్‌ను క్రియేటర్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.
ఈ ఫీచర్‌ను వివరిస్తూ యూట్యూబ్ తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. డిస్‌లైక్స్‌తో ముంచేశారు. ఆ వీడియోకు 11 వేల లైక్స్ వస్తే.. 79 వేల డిస్‌లైక్స్ వచ్చాయి. అంటే.. డిస్లైక్ కౌంట్‌ను తీసేయొద్దు అని చెప్పడం కోసం యూజర్లు ఇలా చేశారా.. లేక యూజర్లు అంతా ఆ వీడియోపై అటాక్ చేశారా? అనేది అర్థం కావడం లేదు.
RIP YouTube dislike feature 💀 pic.twitter.com/aPc9yfguLh
— elizabeth (@bibishoff) November 11, 2021
ఏది ఏమైనా.. ఈ డిస్లైక్ కౌంట్ ఫీచర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఎక్కువ డిస్‌లైక్స్ వచ్చిన వీడియోల థంబ్‌నెయిల్స్‌ను కూడా షేర్ చేస్తున్నారు. వాటిపై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Youtube is removing the dislike/like ratio so I guess RIP the best YouTube video that used the like/dislike bar. pic.twitter.com/6AdDJgL6nm
— Ready? Say, Fuzzy Pickles (@silverstaripper) November 10, 2021
One last time before YouTube vanishes the dislike counter button 😔 pic.twitter.com/r3vJiQiVTW
— ClassicShadowYTReal (@SHedgehogy) November 11, 2021
Starting today, Youtube has replaced the Dislike button with a "Diss I Like" button pic.twitter.com/yDt3fsJiBj
— 🅿🅰🅽-🅿🅸🆉🆉🅰 (@RebelTaxi) November 10, 2021
YouTube got fed up of everyone disliking YouTube rewind so that’s why they removed the dislike button. Bullied them too much
— 👾 Angel👾 (@Aliofonzy43) November 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
టెక్నో పాప్ 5సీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్
Xiaomi : 30న భారత్‌లో రెడ్మి నోట్ 11టీ లాంఛ్
WhatsApp : వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఇరిటేటింగ్ ఫీచర్ కనిపించదు
iPhone X : రూ.64 లక్షలకు అమ్ముడుపోయిన ఐఫోన్ ఎక్స్.. ఎక్కడో తెలుసా?
Microsoft : ఫ్రెషర్స్ కావలెను.. హైదరాబాద్ లొకేషన్ కోసం మైక్రోసాఫ్ట్ నియామకాలు