WhatsApp : వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఇరిటేటింగ్ ఫీచర్ కనిపించదు
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్ | వాట్సప్‌లో నాకు నచ్చని ఒకే ఒక్క ఫీచర్.. లాస్ట్ సీన్(Last seen) అని చాలామంది చెబుతుంటారు. ఎందుకంటే.. వాట్సప్‌లో ఎంతసేపు గడిపింది ఆ లాస్ట్ సీన్ అనే ఫీచర్ మన
వాట్సప్‌లో నాకు నచ్చని ఒకే ఒక్క ఫీచర్.. లాస్ట్ సీన్(Last seen) అని చాలామంది చెబుతుంటారు. ఎందుకంటే.. వాట్సప్‌లో ఎంతసేపు గడిపింది ఆ లాస్ట్ సీన్ అనే ఫీచర్ మన వాట్సప్ కాంటాక్ట్స్‌కు చెప్పేస్తుంది. అది నిజానికి ప్రైవసీకి భంగం కలిగించేదే. అందుకే.. లాస్ట్ సీన్లో కొన్ని ఆప్షన్లను తీసుకొచ్చింది వాట్సప్.

లాస్ట్ సీన్లో కొన్ని ఆప్షన్లు కూడా ఉన్నాయి. అవి ఎవిరీవన్(Everyone), మై కాంటాక్ట్స్(My Contacts), నోబడీ(Nobody). వీటిలో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే డీఫాల్ట్‌గా నోబడీ ఆప్షన్‌ను వాట్సప్ సెలెక్ట్ చేస్తుంది. దాని వల్ల.. లాస్ట్ సీన్‌ను వాట్సప్ కాంటాక్ట్స్ అందరూ చూసే అవకాశం ఉంటుంది.
ఒకవేళ.. లాస్ట్ సీన్‌ను ఎవ్వరూ చూడకూడదు అని అనుకుంటే.. ఎవిరీవన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కాంటాక్ట్స్ లిస్టులో ఉన్నవాళ్లు మాత్రమే చూడకూడదు అని అనుకుంటే మై కాంటాక్ట్స్ ఆప్షన్‌ను సెట్ చేసుకోవాలి. కానీ.. స్పెసిఫిక్ కాంటాక్ట్స్‌కు లాస్ట్ సీన్ కనిపించకుండా సెట్ చేసుకునే ఆప్షన్ లేదు.

ఇప్పుడు ఆ ఆప్షన్నే వాట్సప్ త్వరలో తీసుకురానుంది. ప్రస్తుతం వాట్సప్ బీటా వర్షన్లో ఈ ఆప్షన్‌ను తీసుకురానుంది వాట్సప్. ఇదివరకు ఉన్న ఎవిరీవన్, మై కాంటాక్ట్స్, నోబడీతో పాటు.. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్(My contacts except) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో స్పెసిఫిక్ కాంటాక్ట్స్‌ను సెలెక్ట్ చేసుకుంటే వాళ్లకు లాస్ట్ సీన్ అస్సలు కనిపించదు. బీటా వర్షన్లో టెస్టింగ్ సక్సెస్ అయితే.. ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది వాట్సప్.
అయితే.. లాస్ట్ సీన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. ఇతర కాంటాక్ట్స్ లాస్ట్ సీన్ కూడా చూసే అవకాశం ఉండదు. మీ లాస్ట్ సీన్‌ను షేర్ చేస్తేనే ఇతర కాంటాక్ట్స్ లాస్ట్ సీన్ చూసే చాన్స్ ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iPhone X : రూ.64 లక్షలకు అమ్ముడుపోయిన ఐఫోన్ ఎక్స్.. ఎక్కడో తెలుసా?
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

