iPhone X : రూ.64 లక్షలకు అమ్ముడుపోయిన ఐఫోన్ ఎక్స్.. ఎక్కడో తెలుసా?
రూ.64 లక్షలకు అమ్ముడుపోయిన ఐఫోన్ ఎక్స్ | ఎట్టెట్టా.. ఐఫోన్ ఎక్స్ ఖరీదు 64 వేలు కూడా ఉండదు. దాన్ని 64 లక్షలకు అమ్మడం ఏంది.. అని ఎట్టెట్టా.. ఐఫోన్ ఎక్స్ ఖరీదు 64 వేలు కూడా ఉండదు. దాన్ని 64 లక్షలకు అమ్మడం ఏంది.. అని ఆశ్చర్యపోతున్నారా? దాంట్లో ఓ మతలబు ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి.
ఎట్టెట్టా.. ఐఫోన్ ఎక్స్ ఖరీదు 64 వేలు కూడా ఉండదు. దాన్ని 64 లక్షలకు అమ్మడం ఏంది.. అని ఆశ్చర్యపోతున్నారా? దాంట్లో ఓ మతలబు ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి.

అది పేరుకు ఐఫోన్ ఎక్సే కానీ.. దానిలో ఓ యూజర్ కమ్ ఇంజినీర్ కొన్ని మార్పులు చేశాడు. అందుకే.. ఆ ఫోన్‌కు అంత డిమాండ్. ఇంతకీ ఆ ఫోన్లో ఏం మార్పులు చేశాడు అంటారా? దానికి యూఎస్బీ సీ పోర్ట్‌ను అమర్చి.. ఆ ఫోన్ యూఎస్బీ ద్వారా ఫోన్లోని డేటాను మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకునే ఫీచర్‌ను యాడ్ చేశాడు. అదే పోర్ట్‌లో ఫోన్ చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట.
శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ కెన్ పిల్లొనెల్ గత నెలలో ఐఫోన్ ఎక్స్‌లో ఈ మార్పులు చేశాడు. యాపిల్ ఫోన్ యూజర్లకు ఇంకా కావాల్సిన ఫీచర్లేమిటీ ఊహించి.. ఇవి అవసరం అని తెలుసుకొని వాటిని యాడ్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
ఆ ఫోన్లో ఎలా ఈ ఫీచర్లు యాడ్ చేశాడో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు కెన్. ఆ వీడియోను చూసిన పలువురు.. తమకు ఆ ఫోన్ కావాలంటూ కెన్‌కు రిక్వెస్టులు పెట్టడం ప్రారంభించారు. దీంతో ఆ ఫోన్‌ను ఈబేలో వేలం వేశాడు. ఆ వేలంలో 85 వేల డాలర్లు చెల్లించి ఆ ఫోన్ కొనుగోలు చేస్తామని ఓ కస్టమర్ రిక్వెస్ట్ పెట్టాడు. చివరకు 86,001 డాలర్‌కు వేలం ముగిసింది. అంటే.. మన కరెన్సీలో సుమారు 64 లక్షల రూపాయలు అన్నమాట. మొత్తం ఆ ఫోన్ కోసం 116 మంది బిడ్స్ వేయగా.. ఫోన్‌ను వేలంలో వేసిన మొదటి మూడు రోజుల్లోనే ఎక్కువ బిడ్స్ వచ్చాయి.
ఈ మార్పులు చేశాక కూడా ఐఫోన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని.. కాకపోతే రీస్టోర్, అప్డేట్, డిలీట్ డేటా విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుందని కెన్ స్పష్టం చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

