Xiaomi 12 Pro 5G | క్రోమాలో క్రేజీ డీల్ : రూ. 27,999కే షియామి 12 ప్రొ 5జీ
షియామి 12 ప్రొ 5జీ (Xiaomi 12 Pro 5G) క్రోమాలో ఆకర్షణీయ ధరకు అందుబాటులో ఉంది. భారత్‌లో రూ. 62,999కి లాంఛ్ చేసిన ఈ హాట్ డివైజ్‌ను ఆన్లైన్లో రూ. 27,999కి విక్రయిస్తున్నారు.
న్యూఢిల్లీ : షియామి 12 ప్రొ 5జీ (Xiaomi 12 Pro 5G) క్రోమాలో ఆకర్షణీయ ధరకు అందుబాటులో ఉంది. భారత్‌లో రూ. 62,999కి లాంఛ్ చేసిన ఈ హాట్ డివైజ్‌ను ఆన్లైన్లో రూ. 27,999కి విక్రయిస్తున్నారు. ఈ ఆఫర్‌పై ఎలాంటి షరతులు లేకుండా క్రోమా షియామి 12 ప్రోపై ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. షియామి 12 ప్రొ క్రోమాపై రూ. 27,999కి లిస్ట్ కావడంతో కస్టమర్లు ఈ హాట్ డీల్‌కు మొగ్గుచూపుతున్నారు.
ఈ డివైజ్‌ను సొంతం చేసుకునే వారికి ఏకంగా రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఇదే షియామి ఫోన్‌ను అమెజాన్ 39,999కి విక్రయిస్తుండగా ఫ్లిప్‌కార్ట్ రూ. 49,999కి సేల్ చేస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ముందుగా పెర్ఫామెన్స్ ది బెస్ట్‌గా నిలుస్తుంది.
లేటెస్ట్ షియామి ఫోన్ వేగవంతమైన పెర్ఫామెన్స్‌ను అందించే ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగిఉంది. దీంతో పాటు తక్కువ ధరలో అత్యధిక స్టోరేజ్ కలిగిఉండటం అడ్వాంటేజ్‌గా టెక్ నిపుణులు చెబుతున్నారు. కెమెరా పెర్ఫామెన్స్ కూడా ఈ ధరల శ్రేణిలో మెరుగైనదే. ఫోన్ వెనుకభాగంలో 50 ఎంపీ కెమెరాలు మూడు ఉండగా, వీటిలో ఒకటి టెలిఫొటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంది. 120డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4600ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read More :
Alaska Airlines | విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్లు ఆఫ్ చేసేందుకు యత్నించిన పైలట్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

