మంగళవారం 02 మార్చి 2021
Science-technology - Jan 25, 2021 , 18:28:22

ఇండియ‌న్లపై వాట్సాప్ నిర్ణ‌యం ఏక‌ప‌క్షం: ‌కేంద్రం

ఇండియ‌న్లపై వాట్సాప్ నిర్ణ‌యం ఏక‌ప‌క్షం: ‌కేంద్రం

న్యూఢిల్లీ: భార‌తీయ యూజ‌ర్ల ప‌ట్ల ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ద‌ని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్ర‌భుత్వం నివేదించింది. ఇటీవ‌ల వాట్సాప్ ప్ర‌క‌టించిన న్యూ ప్రైవ‌సీ పాల‌సీతో ఇమిడి ఉన్న యూజ‌ర్ల ఆందోళ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని, ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని జ‌స్టిస్ సంజీవ్ స‌చ్‌దేవా బెంచ్ ముందు కేంద్రం త‌ర‌ఫున విచార‌ణ‌కు హాజ‌రైన అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ (ఏఎస్జీ) చేత‌న్ శ‌ర్మ వెల్ల‌డించారు.

నూత‌న ప్రైవ‌సీ పాల‌సీని ఎంచుకునే విష‌య‌మై భార‌త్‌, ఐరోపా యూజ‌ర్ల ప‌ట్ల ప‌ర‌స్ప‌రం భిన్నంగా వాట్సాప్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని చేత‌న్ శ‌ర్మ తెలిపారు. కొత్త పాల‌సీని ఎంచుకోబోమ‌న్న ఆప్ష‌న్‌ను ఐరోపా దేశాల యూజ‌ర్ల‌కు వాట్సాప్ ఇచ్చింద‌న్నారు. కానీ భార‌త్ యూజ‌ర్ల‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌న్నారు. ఏక‌ప‌క్షంగా న్యూ ప్రైవ‌సీ పాల‌సీకి మారాల‌ని భార‌త్ యూజ‌ర్ల‌ను కోర‌డం ఆందోళ‌న‌క‌రం అని పేర్కొన్నారు. వాట్సాప్ న్యూ ప్రైవ‌సీ పాల‌సీకి వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్‌పై సోమ‌వారం ఢిల్లీ హైకోర్టు విచారించింది.

వాట్సాప్ నూత‌న ప్రైవ‌సీ పాల‌సీని డౌన్‌లోడ్ చేసుకోవాలా? వ‌ద్దా? అన్న విష‌య‌మై యూజ‌ర్లు స్వ‌చ్ఛంద నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఈ నెల 18న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌కే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు చేత‌న్ శ‌ర్మ తెలిపారు. వాట్సాప్ నూత‌న ప్రైవ‌సీ పాల‌సీ పూర్తి వివ‌రాలు తెలియ‌జేయాల‌ని ఆ సంస్థ యాజ‌మాన్యాన్ని ఆదేశించామ‌న్నారు. వాట్సాప్ త‌ర‌ఫున విచార‌ణ‌కు హాజ‌రైన సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబాల్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ వాద‌న‌పై త‌ర్వాత స్పందిస్తామ‌ని పేర్కొన‌డంతో ఈ పిటిష‌న్ త‌దుప‌రి విచార‌ణ‌ను మార్చి ఒక‌టో తేదీకి వాయిదా వేసింది.  ఇంత‌కుముందు జ‌రిగిన విచార‌ణ‌లో ఈ యాప్ నుంచి తొలిగిపోవాల‌నుకున్న‌యూజ‌ర్లు.. ప్ర‌త్యామ్నాయ యాప్‌ల్లో చేరొచ్చున‌ని న్యాయ‌స్థానం తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo