ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ రోజురోజుకూ సరికొత్త ఫీచర్లతో తన యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్‌కు కోట్లలో యూజర్లు ఉన్నారు. అందుకే.. ఎప్పటికప్పుడు యాప్‌ను తాజాగా ఉంచుతూ.. సరికొత్త అప్డేట్స్ను తీసుకొస్తోంది.
ఇటీవలే వ్యూ వన్స్, పేమెంట్ ఆప్షన్ షార్ట్‌కట్ లాంటి ఫీచర్ల మీద దృష్టి సారించిన వాట్సప్.. తాజాగా మరో ఫీచర్‌తో ముందుకొచ్చింది. సాధారణంగా.. ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్స్‌లో చాట్ బాక్స్‌లో ఎవరైనా మెసేజ్ పంపిస్తే… దానికి రిప్లయి ఇవ్వకుండానే.. ఆ మెసేజ్‌కు రియాక్షన్స్ పంపించొచ్చు. దాన్నే మెసేజ్ రియాక్షన్స్ అని పిలుస్తారు.
ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఐమెసేజ్ లాంటి వాటిలో ఈ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌ను వాట్సప్‌లోనూ తీసుకురావాలని ఫేస్బుక్ యోచిస్తోంది. ఇప్పటికే వాట్సప్ చాట్ బాక్స్‌లో స్టిక్కర్స్, ఎమోజీస్, జీఐఎఫ్ ఇమేజెస్ లాంటివి పంపించుకోవచ్చు. దానితో పాటు.. మెసేజ్ రియాక్షన్స్‌ను కూడా యాడ్ చేయాలని వాట్సప్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఇంటర్నల్‌గా వాట్సప్ టెస్ట్ చేస్తోంది.
కాబట్టి.. బీటా టెస్టర్స్, మిగితా యూజర్లకు ఈ ఫీచర్ ఇప్పుడే అందుబాటులోకి రాదు. ఒకవేళ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటే.. వాట్సప్ ముందే తమ యూజర్లు అందరికీ మెసేజ్ పంపించి.. వాట్సప్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని కోరుతుందని చెబుతున్నారు.