ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పేమెంట్స్ యాప్ ఏవి… అంటే టక్కున వచ్చే సమాధానం.. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అందుకే డిజిటల్ వాలెట్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కూడా పేమెంట్ ఆప్షన్‌ను యాడ్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా ఎలాగైతే డబ్బులు పంపిస్తారో.. వాట్సప్‌లోనూ డిజిటల్ లావాదేవీలు జరుపుకోవచ్చు. పేమెంట్ ఆప్షన్ ఉంటుంది.
వాట్సప్‌లో పేమెంట్ ఫీచర్ ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది గూగుల్ పే, ఫోన్‌పేనే వాడుతున్నారు. దీంతో యూజర్లను ఆకట్టుకోవడం కోసం.. వాట్సప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాష్‌బ్యాక్ స్కీమ్‌ను స్టార్ట్ చేసింది. వాట్సప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే రూ.51 క్యాష్‌బ్యాక్ అందించనుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్.. వాట్సప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సప్ బీటా వర్షన్ 2.21.20.3 లో మాత్రమే క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్క్ అవుతుంది. గివ్ క్యాష్.. గెట్ రూ.51 బ్యాక్ అనే నినాదంతో వాట్సప్ ఈ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.
ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకారం.. యూజర్లు వేర్వేరు కాంటాక్ట్స్‌కు ఐదు సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. రూపాయి నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ పంపించుకోవచ్చు. పేమెంట్ చేయగానే రూ.51 అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అయితే.. మొదటి ఐదు పేమెంట్స్‌కు మాత్రమే రివార్డ్ వస్తుంది. ఈ ఫీచర్ ఇండియన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Facebook : ఫేస్బుక్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. యాపిల్ వాచ్‌కు దీటుగా
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో
Diwali Offer : దివాళీ బంపర్ ఆఫర్.. రూ.101 కే వివో ఫోన్.. త్వరపడండి
యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది? ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాల సంగతేంటి?