న్యూఢిల్లీ : వివో భారత్‌లో వై సిరీస్ కింద తన తొలి ప్రీమియం ఫోన్ వివో వై100 లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌తో ఆకట్టుకోనుంది. ఫ్యాన్సీ డిజైన్‌తో పాటు వివో వై100 మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, 64 ఎంపీ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగిఉంది. ఆర్ట్, టెక్నాలజీ మేళవింపును కొనసాగిస్తూ వై సిరీస్ పోర్ట్‌పోలియోను విస్తరిస్తూ ఆల్న్యూ వివో వై100ను ప్రవేశపెట్టామని వివో ఇండియా బ్రాండ్ స్ట్రేటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల వెల్లడించారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌తో కలర్ చేంజింగ్ టెక్నాలజీ, 64ఎంపీ ఓఐఎస్ యాంటీ-షేక్ కెమెరాను వై సిరీస్‌లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. యువత స్టైల్‌కు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీని జోడించి వివో వై100ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చామని తెలిపారు. వివో వై100 8జీబీ+128జీబీ వేరియంట్ రూ. 24,999కి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
పసిఫిక్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, మెటల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. వివో వై100 6.38 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లను కలిగిఉంది. వివో వై100 మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13పై రన్ అవుతుంది. 44డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. వివో వై100 64ఎంపీ ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.