న్యూఢిల్లీ : భారత్‌లో ఈనెల 4న వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ (Vivo X100 series) లాంఛ్ కానున్నాయి. అదే రోజు దేశంలో రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇక వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ ఇప్పటికే గ్లోబల్ లాంఛ్ పూర్తి కాగా 4న దేశీ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. వివో ఎక్స్100 భారత్‌లో 256జీబీ మోడల్ రూ. 63,999 కాగా, 512జీబీ వేరియంట్ రూ. 69,999కి అందుబాటులో ఉండనున్నాయి.
ఇక వివో ఎక్స్100 ప్రొ స్మార్ట్‌ఫోన్ 512జీబీ స్టోరేజ్ ఆప్షన్ రూ. 89,999కి లభిస్తోంది. ఇక స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ రిటైలర్ మార్జిన్‌తో కలిపి మరికొంత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ హాట్ సిరీస్ డివైజ్‌ల ఫీచర్ల విషయానికి వస్తే వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్తో 8టీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో కూడిన 6.78 ఇంచ్ స్క్రీన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
వివో ఎక్స్100, ఎక్స్ 100ప్రొ రెండూ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానున్నాయి. వివో ఎక్స్100 ప్రొ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 100 ఎంఎం జూమ్ లెన్స్, 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆకట్టుకోనుంది.
Read More :