న్యూఢిల్లీ : వాయిస్, వీడియో కాల్స్‌కు ఫ్రెష్ డిజైన్ తీసుకువస్తే టెలిగ్రాం (Telegram) లేటెస్ట్ అప్డేట్ వెర్షన్ 10.5.0 ప్రకటించింది. పూర్తి ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌లు, వాయిస్, వీడియో కాల్స్ కోసం దేశవ్యాప్తంగా పలువురు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ న్యూ అప్డేట్ న్యూ లుక్, అప్పీల్ తీసుకురానుంది.
నూతన యూఐ (యూజర్ ఇంటర్ఫేస్) పరిమిత వనరులను వాడుతూ మెరుగైన సామర్ధ్యంతో పాటు మీ ఫోన్ల బ్యాటరీ లైఫ్‌ను పొడిగిస్తుందని టెలిగ్రాం పేర్కొంది. అప్డేట్తో పాత డివైజ్‌ల్లోనూ ఈ యాప్ మెరుగ్గా పనిచేస్తుందని తెలిపింది.
ఈ అప్డేట్లో తాము న్యూ యానిమేషన్స్, అందమైన బ్యాక్‌గ్రౌండ్స్‌తో కాల్స్‌ను పూర్తిగా రీడిజైన్ చేశామని, రింగింగ్, యాక్టివ్, ఎండెడ్ వంటి కాల్ స్టేటస్‌కు అనుగుణంగా ఇవి మారతాయని న్యూ అప్డేట్ను వివరిస్తూ టెలిగ్రాం వెల్లడించింది. ఈ న్యూ అప్డేట్తో ఫోన్ బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుందని, పాత డివైజ్‌లపైనా మెరుగ్గా పనిచేస్తుందని తెలిపింది. మెరుగైన కాల్ నాణ్యత కూడా పెరుగుతుందని యాప్ ప్రకటించింది.
Read More :