వేలల్లో ఒక్క స్మార్ట్‌ఫోన్ పేలుతూ ఉంటుంది. అది టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు.. లేదా బ్యాటరీ సమస్యలు.. ఇతర సమస్యల వల్ల పేలుతూ ఉంటాయి. ఒక్కోసారి ఫోన్ పేలిపోవడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఫోన్‌ను చార్జింగ్ పెట్టి మాట్లాడటం, చార్జింగ్‌లో ఉంచి ఫోన్‌ను వాడటం లాంటివి చేయకూడదని టెక్ నిపుణులు చెబుతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఫోన్లు జేబుల్లో ఉన్నప్పుడు కూడా పేలిపోతుంటాయి.
ఇటీవల అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వన్‌ప్లస్ నోర్డ్2 5జీ స్మార్ట్‌ఫోన్ ఓ యువకుడి ప్యాంట్ జేబులో ఉండగానే పేలిపోయింది. దీంతో ఆ యువకుడి తొడకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
ఇలా.. వన్‌ప్లస్ నోర్డ్2 ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు రెండుమూడు సార్లు మన దేశంలోనే పేలుళ్లు సంభవించాయి. తాజాగా జరిగిన ఈ ఘటనను ట్విట్టర్లో ఓ యూజర్..వన్‌ప్లస్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన కంపెనీ.. ఆ యువకుడి వైద్య ఖర్చులను భరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు.. ఆ ఫోన్ అమౌంట్‌ను కూడా రిఫండ్ చేసినట్టు వెల్లడించింది. అయితే.. ఆ యువకుడికి కంపెనీ ఎంత నష్టపరిహారం చెల్లించిందో ఆ వివరాలు మాత్రం చెప్పలేదు. వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్ తర్వాత నోర్డ్ 2 సిరీస్‌ను కంపెనీ గత జులైలో విడుదల చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Youtube : యూట్యూబ్‌లో ఇక ఆ ఫీచర్ కనిపించదు
చరిత్రలో ఈరోజు : 38 ఏండ్ల క్రితం ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ విండోస్
OnePlus Nord 2 : మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 స్మార్ట్‌ఫోన్..
Xiaomi 12 : ఏడాది చివరన ఎంట్రీ ఇవ్వనున్న షియోమి 12
Facebook : పేరు మార్చిన కొన్ని రోజులకే ఫేస్‌బుక్‌కు బిగ్ షాక్..