చరిత్రలో ఈరోజు : 38 ఏండ్ల క్రితం ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ విండోస్
Today History : 38 ఏండ్ల క్రితం మైక్రోసాఫ్ట్ సంస్థ తన తొలి విండోస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అక్కడి నుంచి బిల్ గేట్స్ వెనక్కి చూడాల్సి రాలేదంటే అతిశయోక్తి కాదేమో..! 1983 లో...

( Today History) 38 ఏండ్ల క్రితం మైక్రోసాఫ్ట్ సంస్థ తన తొలి విండోస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అక్కడి నుంచి బిల్ గేట్స్ వెనక్కి చూడాల్సి రాలేదంటే అతిశయోక్తి కాదేమో..! 1983 లో సరిగ్గా ఇదే రోజున మైక్రోసాఫ్ట్ సంస్థ తన విండోస్ 1.01 ను మార్కెట్లో పరిచయం చేసింది. ఈ విండోస్ రన్ చేయడానికి అప్పట్లో కంప్యూటర్లలో 256 కేబీ ర్యామ్, గ్రాఫిక్స్ అడాప్టర్, ఫ్లాపీ హార్డ్ డ్రైవ్‌ల అవసరం ఉండేది. ఈ విండోస్ లాంచ్ చేసిన రెండేండ్లకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దాదాపు 72 శాతం ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ విండోస్‌ను వాడుతుండటం సంస్థ పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రోజుకో కొత్త సాఫ్ట్వేర్, యాప్‌లు అందుబాటులోకి వస్తున్నా.. మైక్రోసాఫ్ట్ మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు.

మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన 28 సంవత్సరాల వయస్సులో మొదటిసారిగా ఈ విండోస్‌ను ప్రారంభించాడు. ఈ విండోస్ ప్రస్తుతం దాదాపు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కంప్యూటర్లపై చేస్తున్న పనిని ఆరోజుల్లో ఎవరూ ఊహించి ఉండరు. ఆ రోజుల్లో విండోస్ 1.01 వెర్శన్ తీసుకురాకపోయి ఉంటే.. ఇవాళ డెస్క్‌టాప్ కంప్యూటర్ల పరిస్థితి ఏవిధంగా ఉండేదో అని ఆలోచిస్తేనే విచిత్రంగా తోస్తుంది.
తొలుత ఈ విండోస్‌కు బిల్ గేట్స్ ఇంటర్ఫేస్ మేనేజర్ అని పేరు పెట్టాలనుకున్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ అధికారి రోలాండ్ హాన్సన్ సూచించిన విండోస్ అనే పేరు బాగుండటంతో దాన్ని ఖాయం చేశారు. ‘ఈ విండోస్ వినియోగదారులకు అపూర్వమైన శక్తిని అందిస్తుంది. ఇది రానున్న కొన్నేండ్లకు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధికి పునాది వేస్తుంది’ అని విండోస్ 1.01 లాంచ్ సందర్భంగా గేట్స్ చెప్పడం ఆయన భవిష్యత్ కార్యాచరణకు అద్దం పడుతున్నదని చెప్పవచ్చు.
ఈ విండోస్ కారణంగానే బిల్ గేట్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
తెలుగు సాహిత్యానికి విశేష సేవలతోపాటు తొలి తెలుగు డిక్షనరీని అందించిన సీపీ బ్రౌన్ జయంతి నేడు
2014: సినిమా పరిశ్రమలో మహిళలు మేకప్ ఆర్టిస్టులుగా పని చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీంకోర్టు
2001: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి
1997: చైనా-రష్యా డిక్లరేషన్‌తో రెండు దేశాల మధ్య ముగిసిన సరిహద్దు వివాదం
1991: ప్రపంచ క్యారమ్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను గెలుచుకున్న భారత్ జట్టు
1990: భారతదేశం ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం
1989: బెర్లిన్ గోడను కూల్చివేయడం ప్రారంభించిన జర్మనీ ప్రజలు
1903 : వాహనాల అద్దాలపై వాడే విండ్ షీల్డ్ వైపర్లకు పెటెంట్ అందుకున్న మేరి అండర్సన్
1885: ప్రపంచంలో మొట్టమొదటి మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసిన గాట్లీబ్ డైమ్లెర్
ఇవి కూడా చదవండి..
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

