మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Science-technology - Sep 15, 2020 , 20:14:48

ఇన్‌హేల్‌గా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పరీక్షించనున్న బ్రిటన్‌ శాస్త్రవేత్తలు!

ఇన్‌హేల్‌గా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పరీక్షించనున్న బ్రిటన్‌ శాస్త్రవేత్తలు!

లండన్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ పరీక్షల్లో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. శ్వాసకోశానికి నేరుగా డోస్‌లను ఇచ్చేందుకు సాంప్రదాయక ఇంజెక్షన్‌ పద్ధతి కంటే ఇన్‌హేల్‌ పద్ధతి మెరుగ్గా ఉంటుందా? లేదా? అని తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్‌ను ఇంపీరియల్‌ శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. ఇన్‌హేల్‌ చేయడం ద్వారా డ్రగ్‌ అనేది నేరుగా ఊపిరితిత్తుల్లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందా? లేదా? అనేది పరిశీలించనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.

ప్రస్తుతం ఇంజెక్ట్‌ చేస్తున్న టీకాలనే 30 మంది వలంటీర్లకు నెబ్యులైజర్ మెషిన్ ద్వారా ఆస్తమా మందులాగా ఇన్‌హేలేషన్‌ చేయనున్నారు. వీటిని పీల్చుకోవడం మరింత ప్రత్యేక ప్రతిస్పందన ఉంటుందని ఇంపీరియల్‌ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసల్‌ స్ప్రే ద్వారా పంపించిన ఫ్లూ వ్యాక్సిన్లు వ్యాధి నుంచి మెరుగైన రక్షణ ఇస్తాయనే  ఆధారాలున్నాయి.  సార్స్‌ సీఓవీ-2 విషయంలో కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తున్నాం.’ అని ఇంపీరియల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ విభాగానికి చెందిన క్రిస్ చియు చెప్పారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo