న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలోనూ కొలువుల కోతకు బ్రేక్ పడకపోవడం టెకీల్లో గుబులు రేగుతోంది. అమెరికాకు చెందిన టెక్ స్టార్టప్ ఫ్రంట్‌డెస్క్ (Frontdesk) ఈ ఏడాది తొలి మాస్ లేఆఫ్స్‌కు తెగబడింది. రెండు నిమిషాల వర్చువల్ కాల్ ద్వారా కంపెనీ ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్లో ఫుల్‌టైం, పార్ట్‌టైం, కాంట్రాక్టు ఉద్యోగులపై వేటువేసిందని టెక్‌క్రంచ్ వెల్లడించింది.
కాల్లో ఉద్యోగులను ఉద్దేశించి ఫ్రంట్‌డెస్క్ సీఈవో జెస్సీ డిపింటో మాట్లాడుతూ కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్ధిక కష్టాలను ఏకరవుపెట్టారని, దివాళా ప్రత్యామ్నాయం కోసం కంపెనీ ప్రభుత్వానికి దరఖాస్తు చేయనుందని ఆయన తెలిపారని టెక్‌క్రంచ్ రిపోర్ట్ పేర్కొంది. ప్రాపర్టీ స్టార్టప్ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించడం జాబ్ మార్కెట్లో గుబులు రేపుతోంది.
2017లో ఏర్పాటైన ఫ్రంట్‌డెస్క్ అమెరికా వ్యాప్తంగా 1000 ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్స్‌ను నిర్వహిస్తోంది. విస్కాన్సిన్కు చెందిన ప్రత్యర్ధి కంపెనీ జెన్‌సిటీని స్వాధీనం చేసుకున్న ఏడు నెలల్లోనే ఫ్రంట్‌డెస్క్ ఉద్యోగులపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది.
Read More :