Tata Play Binge | రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) తమ యూజర్లకు సెలెక్టెడ్ ప్లాన్ల కింద కాంప్లిమెంటరీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఇటు జియో, అటు ఎయిర్‌టెల్‌లకు పోటీగా టాటా ప్లే బింజ్ (Tata Play Binge) ముందుకు వచ్చింది. ఒకే యాప్, ఒకే వెబ్సైట్ కింద 25కు పైగా ఓటీటీల్లోని కంటెంట్ అందించేందుకు ముందుకు వచ్చింది. అంటే టాటా ప్లే బింజ్ యాప్ సబ్స్క్రిప్షన్ పొందిన యూజర్లు పలు ఓటీటీ వేదికలపై వచ్చే కంటెంట్.. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, సీరియళ్లు వీక్షించొచ్చు. టాటా ప్లే బింజ్ ప్రస్తుతం తన బ్రాడ్‌బాండ్ ప్లాన్లతో 25కి పైగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. టాటా ప్లే బింజ్ సబ్స్క్రిప్షన్లు ప్రస్తుతం 50ఎంబీపీఎస్ ప్లాన్ నుంచి మొదలవుతున్నాయి. రూ.199 నుంచి టాటా ప్లే బింజ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది.
టాటా ప్లే బింజ్ బ్రాడ్‌బాండ్ ప్లాన్ కింద.. డిస్నీ + హాట్‌స్టార్ (Disney+ Hotstar), సోనీ లివ్ (SonyLiv), జీ5 (Zee5), లైన్స్‌గేట్ ప్లే (Lionsgate Play), హంగామా ప్లే (Hungama Play), ఎరోస్ నౌ (Eros Now), వూట్ కిడ్స్ (Voot Kids), షీమారో (Shemaroo), ఎంఎక్స్ ప్లేయర్ (MX Player), హోచోయి (Hoichoi), చౌపాల్ (Chaupal), ప్లానెట్ మరాఠీ (Planet Marathi), ఎపిక్ ఆన్ (Epic On), డాకుబే (Docubay), రీల్ డ్రామా (Reel Drama), సన్ ఎన్ఎక్స్టీ (SunNXT), క్యూరియాసిటీ (Curiosity), నమ్మా ఫ్లిక్స్ (NammaFlix), కూడ్ (Koode) వంటి ఓటీటీ వేదికల్లో వచ్చే కార్యక్రమాలను వీక్షించవచ్చు.
టాటా ప్లే బింజ్ సబ్స్క్రిప్షన్ పొందిన వారికి ఈ ఓటీటీ వేదికల కంటెంట్ అందుబాటులో ఉంటది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, 12 నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్లు టాటా ప్లే బింజ్ అందిస్తున్నది. నెలవారీ సబ్స్క్రిప్షన్ కోసం రూ.199, మూడు నెలలకు రూ.569, 12 నెలల ప్లాన్‌కు రూ.2189 పే చేయాల్సి ఉంటుంది. అయితే, నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు మొబైల్ ఫోన్లో మాత్రమే డిస్నీ+హాట్ స్టార్తోపాటు సన్ నెక్ట్స్, ఎఫ్‌టీవీ, బింజ్+లో మాత్రమే వీక్షించవచ్చు. వీటితోపాటు సూపర్, మెగా సబ్స్క్రిప్షన్లు ప్లాన్లు కూడా టాటా ప్లే బింజ్‌లో అందుబాటులో ఉన్నాయి.
దీని ప్రకారం యూజర్లు గడువు ముగిసేలోగా తమ సబ్స్క్రిప్షన్లు రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో గడువు ముగిసిన తర్వాత ఆయా ఓటీటీ వేదికలపై వచ్చే కార్యక్రమాలు వీక్షించలేరు. టాటా ప్లే బింజ్ సబ్స్క్రిప్షన్ ద్వారా మొబైల్, డెస్క్‌టాప్, లాప్టాప్ల్లోనూ కార్యక్రమాలు వీక్షించవచ్చు.