(Sun and Earth Close) వినీలాకాశంలో అద్భుతం చోటుచేసుకున్నది. ఏటా జనవరి నెలలో సంభవించే ఈ దృగ్విషయాన్ని చూసేందుకు, దీనిపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు వేయి కండ్లతో ఎదురుచూస్తుంటారు. ఇవాళ సరిగ్గా 12.09 నిమిషాలకు సూర్యుడు, భూమి దగ్గరగా వచ్చాయి. కాగా, ఇదే ఏడాది జూలై 4 న సూర్యుడు-భూమి అత్యంత దూరమవుతాయి. ఇవాళ సూర్యుడు-భూమి మధ్య దూరం 14 కోట్ల 71 లక్షల 5,052 కిలోమీటర్లుగా ఉండగా.. జూలై 4 న ఈ దూరం 15 కోట్ల 20 లక్షల 98 వేల 455 కిలోమీటర్లుగా ఉండనున్నది. మన భూమి సూర్యుడి కక్ష్యలో ఏడాదికి ఒకసారి దానికి దగ్గరగా ఉంటుంది. ఖగోళ శాస్త్రంలో దీనిని పెరిహెలియన్ అంటారు.
ఈ రెండు ఖగోళ సంఘటనల గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భూమి సూర్యుడికి సమీపంలో ఉన్నప్పుడు అది చల్లని కాలం, అదే దూరంగా వెళ్లిటప్పుడు వేడిగా ఉంటుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి తన అక్షం మీద దాదాపు 23.5 డిగ్రీలు వంపు తిరిగి ఉంటుంది. దీని కారణంగానే రుతువులు ఏర్పడతాయి. వంపు కారణంగా సూర్యుడి కిరణాలు నేరుగా పడటానికి బదులుగా ఏటవాలుగా పడటం వల్ల చల్లటి అనుభూతి కలుగుతుంది. దీంతోపాటు గాలిపీడనం, ఎడారి నుంచి వచ్చే గాలుల కారణంగా ఉష్ణోగ్రత ప్రభావితమవుతుంది.
✨ This new year comes with cosmic treats! In January, our planet will be at its closest point in orbit around the Sun, known as perihelion. We’ll also get a chance to see Uranus near the Moon and Mars and spot a fast-moving Mercury. 🔭
— NASA JPL (@NASAJPL) December 31, 2020
Skywatching tips: https://t.co/HTlEpZ1khX pic.twitter.com/bx3WduD7ue
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..