Latest Study | ఏడు నిమిషాల్లో సాఫ్ట్‌వేర్‌ను క్రియేట్ చేసిన ఏఐ చాట్‌బాట్స్
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ రాకతో ఏఐ చాట్‌బాట్స్‌పై (Latest Study) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది.
న్యూఢిల్లీ : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ రాకతో ఏఐ చాట్‌బాట్స్‌పై (Latest Study) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ ఆధారిత చాట్‌బాట్స్ టెక్ట్స్ రాయడం, సమాచారం షేర్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ టాస్క్‌లకు సాయపడటం, వ్యాసాలు రాయడం వంటి ఎన్నో టాస్క్‌లను ఇట్టే పూర్తిచేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. టెక్నాలజీ మెరుగవుతున్న కొద్దీ ఏఐ ఆధారిత చాట్‌బాట్స్ సామర్ధ్యాలు కూడా కొత్తపుంతలు తొక్కుతున్నాయి.
క్లిష్టమైన పనులను కూడా చాట్‌బాట్స్ క్లియర్ చేస్తూ యూజర్లకు సౌకర్యవంతంగా మారాయి. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్స్ తక్కువ మ్యాన్‌పవర్‌తో సాఫ్ట్వేర్ కంపెనీని సమర్ధంగా నడపగలవని, కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. చాట్‌జీపీటీ వెర్షన్ 3.5ని వాడుతూ అదనపు శిక్షణ లేకుండా కంప్యూటర్ ప్రోగ్రాం సాఫ్ట్‌వేర్‌ను సృష్టించగలదా అని పరీక్షించేందుకు బ్రౌన్ యూనివర్సిటీ, చైనీస్ యూనివర్సిటీల పరిశోధకులు అధ్యయనం చేపట్టారు.
దీనికోసం వీరు చాట్‌దేవ్ అనే కాల్పనిక కంపెనీని క్రియేట్ చేశారు. ఆపై వారు టాస్క్‌ను ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్తో నాలుగు భాగాలుగా విభజించారు. టాస్క్‌ను పూర్తిచేసేందుకు కీలక సూనలను కంప్యూటర్ ప్రోగ్రామ్స్‌కు ఇచ్చారు. చాట్దేవ్కు 70 టాస్క్‌లను ఇవ్వగా ఏడు నిమిషాల్లోపే అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ను పూర్తిచేసింది. ఇందుకు డాలర్‌లోపే ఖర్చు కావడం విశేషం. కంప్యూటర్ ప్రోగ్రాం సొంతగానే సమస్యలను గుర్తించి పరిష్కరించినట్టు పరిశోధనలో వెల్లడైంది. చాట్‌దేవ్ క్రియేట్ చేసిన సాఫ్ట్‌వేర్‌లో 86.66 శాతం పర్ఫెక్ట్గా ఉందని పరిశోధకులు గుర్తించారు.
Read More :
Ashok Gehlot | రాజస్థాన్ సీఎంకు తల వెంట్రుకలు పంపి నిరసన తెలిపిన సొంత పార్టీ ఎమ్మెల్యే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

