Ashok Gehlot | రాజస్థాన్ ముఖ్యమంత్రి (Rajasthan CM) అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot )కు నిరసన సెగ ఎదురైంది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. తమ డిమాండ్లను సీఎం పట్టించుకోవడం లేదని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే (Sangod MLA) భరత్ సింగ్ (Bharat Singh ) వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గుండు గీయించుకుని ఆ వెంట్రుకలను (hair ) సీఎంకు పంపించారు. దాంతోపాటు ఓ లేఖ కూడా సీఎంకు పంపారు.
‘మీరు (సీఎం) రాష్ట్ర గనుల మంత్రి ప్రమోద్ భయ అవినీతికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఖాన్ కీ జోప్రియా గ్రామాన్ని కోట జిల్లాలో చేర్చలేదు. మీ మీద గౌరవం, విశ్వాసం చచ్చిపోయాయి. అందుకే నేను గుండు గీయించుకుని.. ఆ వెంట్రుకలను మీకు పంపుతున్నా. సీఎం పదవి శాశ్వతం కాదు’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కోట జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా, నిన్న కోటాలో ఓ ప్రారంభోత్సవానికి సీఎం వెళ్లాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దయింది.
Also Read..
KA Paul | చంద్రబాబు అరెస్ట్ సరైనదే : కేఏ పాల్
G20 Meeting: చైనా ప్రతినిధుల బ్యాగులపై అనుమానాలు.. ఢిల్లీ 5 స్టార్ హోటల్లో 12 గంటల హైడ్రామా
India vs Bharat | ఇండియా పేరు మార్పుతో…ఒరిగేదేమీ లేదు!