G20 Meeting: చైనా ప్రతినిధుల బ్యాగులపై అనుమానాలు.. ఢిల్లీ 5 స్టార్ హోటల్లో 12 గంటల హైడ్రామా
G20 Meeting: జీ20 సమావేశాలకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో అనుమానాస్పద వస్తువులను గుర్తించారు. దీంతో ఆ బ్యాగులను స్కానింగ్ చేయాలని అధికారులు ఆదేశించారు.అయితే చైనా అధికారులు ఆ బ్యాగులను ఇచ్చేందుకు నిరాకరించారు. దాదాపు 12 గంటల నిరీక్షణ తర్వాత ఆ బ్యాగులను ఎంబసీకి తరలించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలకు(G20 Meeting) చైనా ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. తాజ్ ప్యాలెస్ హోటల్లో బస చేసిన ఆ ప్రతినిధుల వద్ద ఉన్న రెండు బ్యాగులు కలకలం సృష్టించాయి. విభిన్నమైన ఆకృతిలో ఉన్న ఆ బ్యాగ్‌లను పూర్తిగా చెక్ చేయాలని సెక్యూర్టీ సిబ్బంది కోరింది. కానీ డిప్లమాటిక్ ప్రోటోకాల్ అంటూ చైనా అధికారులు ఆ బ్యాగ్‌లను చెకింగ్ కోసం ఇవ్వలేదు. అయితే ఆ చైనా ప్రతినిధుల రూమ్‌లో ఉన్న బ్యాగుల్లో అనుమానాస్పద పరికరం ఉన్నట్లు హోటల్ సిబ్బంది ఒకరు గుర్తించారు. సెక్యూర్టీ శాఖ ఆ బ్యాగులను తనిఖీ చేయాలని ఆదేశించింది. స్కానర్ ద్వారా బ్యాగులను చెక్ చేయాలని అధికారులు భావించినా.. చైనా ప్రతినిధులు ఆ బ్యాగ్‌లను అప్పగించలేదు. దాదాపు 12 గంటల పాటు అధికారులు ఆ బ్యాగ్‌లను చెక్ చేసేందుకు ఎదురుచూశారు. చిట్టచివరకు ఆ బ్యాగ్‌లను ఎంబసీకి పంపేందుకు చైనా అధికారులు అంగీకరించారు. సుదీర్ఘ చర్చ, సంభాషణల తర్వాత ఆ బ్యాగులను ఎంబసీ తరలించేందుకు ఒప్పుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

