NASA Austronauts : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థా నాసా(NASA)కు చెందిన నలుగురు వ్యోమగాములు (Austronauts) ఈ రోజు నేలపై కాలు మోపారు. దాదాపు ఐదు నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వీళ్లు భూమి మీదకు తిరిగొచ్చారు. స్పేస్ఎక్స్(SpaceX)కు చెందిన డ్రాగన్ ఎండ్యురన్స్ అనే వ్యోమనౌకలో వాళ్లు క్షేమంగా నేలపై ల్యాండ్ అయ్యారు. ఇంతకు వీళ్లలో ఎవరెవరు ఉన్నారంటే..? వ్యోమగామి కియోచి వకాటా (జపాన్), అన్నా కికినా (రష్యా), నాసా ఆస్ట్రోనాట్స్ నికొలే మన్, జోష్ కసాడా ఉన్నారు. ఈ ఏడాది అంతరిక్షంలోకి వెళ్లిన అమెరికాకు చెందిన తొలి మహిళగా మన్ రికార్డు క్రియేట్ చేసింది.
ఒకవారం ముందే ఈ నలుగురు భూమిపైకి రావాల్సింది. కానీ, బలంగా గాలులు వీచడం, పెద్ద ఎత్తున అలలు రావడం వల్ల కొన్ని రోజులు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో శనివారం ఉదయం స్పేస్ఎక్స్ నౌకలో నేలపైకి బయలుదేరారు. ఫ్లోరిడాకు పశ్చిమ తీరాన ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వీళ్ల ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను స్పేస్ఎక్స్ సంస్థ ట్విట్టర్లో పెట్టింది.
అమెరికా, రష్యా, జపాన్‌కు చెందిన ఈ ఆస్ట్రోనాట్స్ గత ఏడాది అక్టోబర్‌లో స్పేస్‌లోకి వెళ్లారు. వీళ్లు అక్కడి అంతరిక్ష కేంద్రంలో ఐదు నెలలు గడిపారు. అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు దెబ్బతిన్న రష్యా వ్యోమనౌకకు మరమ్మతులు కూడా చేశారు. ఎంఎస్ -22కు చెందిన ముగ్గురు సభ్యులు షెడ్యూల్ ప్రకారం మర్చి చివరి కల్లా భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే.. వాళ్లు ఏడాది పాటు అక్కడే ఉండనున్నట్టు సమాచారం.
Splashdown of Dragon confirmed – welcome back to Earth, @AstroDuke, @Astro_Josh, @Astro_Wakata, and Anna! pic.twitter.com/LHrrqL5g6U
— SpaceX (@SpaceX) March 12, 2023