Samsung Galaxy Z Fold 7 | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఇటీవలే నూతన ఫోల్డబుల్ ఫోన్‌తోపాటు ఫ్లిప్ ఫోన్‌ను, కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసిన విషయం విదితమే. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, జడ్ ఫ్లిప్ 7, జడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈలతోపాటు గెలాక్సీ వాచ్ 8 పేరిట నూతన స్మార్ట్ వాచ్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే ఈ ఉత్పత్తులకు గాను భారత్ లో అమ్మకాలను శాంసంగ్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈ ఫోన్లకు భారీ ఎత్తున ప్రీ ఆర్డర్లు రావడం విశేషం. కేవలం 48 గంటల వ్యవధిలోనే ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్లకు ఏకంగా 2.10 లక్షల ప్రీ ఆర్డర్లు భారత్‌లో వచ్చినట్లు శాంసంగ్ తెలియజేసింది. ఈ ఏడాది గెలాక్సీ ఎస్25 సిరీస్ ఫోన్లకు వచ్చినట్లుగానే భారీ ఎత్తున ప్రీ ఆర్డర్లు వచ్చాయని తెలిపారు.
గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, జడ్ ఫ్లిప్ 7, జడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ, గెలాక్సీ వాచ్ 8 ప్రొడక్ట్స్‌ను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నట్లు శాంసంగ్ తెలియజేసింది. శాంసంగ్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చని వివరించింది. ఇక ఈ ఉత్పత్తుల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,74,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,86,999గా ఉంది. 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధరను రూ.2,16,999గా నిర్ణయించారు.
గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,09,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,21,999గా ఉంది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ సైతం రెండు వేరియెంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.89,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.95,999గా ఉంది. ఇక గెలాక్సీ వాచ్ 8లో నాలుగు వేరియెంట్స్ అందుబాటులో ఉన్నాయి. 40ఎంఎం బీటీ మోడల్ ధర రూ.32,999 ఉండగా, 40ఎంఎం ఎల్టీఈ మోడల్ ధర రూ.36,999గా ఉంది. 44ఎంఎం బీటీ మోడల్ ధర రూ.35,999 ఉండగా, 44ఎంఎం ఎల్టీఈ మోడల్ ధరను రూ.39,999గా నిర్ణయించారు.
గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ ఆప్షన్లోనూ రెండు వేరియెంట్లు అందుబాటులో ఉన్నాయి. 46ఎంఎం బీటీ మోడల్ ధర రూ.46,999 ఉండగా, 46ఎంఎం ఎల్టీఈ మోడల్ ధర రూ.50,999గా ఉంది. కాగా ఈ ప్రొడక్ట్స్‌ను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు. రూ.1000 మొదలుకొని రూ.18వేల వరకు ఈ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లను అందిస్తున్నారు. శాంసంగ్ ఆన్లైన్ స్టోర్‌లో ఈ ప్రొడక్ట్స్‌ను కొంటే రాయితీలను పొందవచ్చు. గెలాక్సీ ఫోల్డబుల్ లేదా ఫ్లిప్ ఫోన్‌తోపాటు వాచ్‌ను కూడా కొంటే రూ.15వేల వరకు అదనపు తగ్గింపు ధరను పొందవచ్చు.