Samsung Galaxy S25 Edge | శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎస్25 ఫోన్లను ఇది వరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అదే సిరీస్‌లో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను తాజాగా లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ పేరిట మరో నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను శాంసంగ్ లాంచ్ చేసింది. ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.7 ఇంచుల ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి క్వాడ్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. తెరపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్ కు గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది.
ఈ ఫోన్లో 4.47 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అమర్చారు. 12జీబీ ర్యామ్, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా దీనికి 2 ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ జూమ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. మరో 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 12 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ లభిస్తుంది.
గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్లో వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అడ్వాన్స్ఢ్ ఫీచర్లను అందిస్తున్నారు. 3900 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో అమర్చారు. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. వైర్ లెస్ చార్జింగ్కు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర సరిగ్గా ఎస్25 ప్లస్, ఎస్25 అల్ట్రా ధరల మధ్యలో ఉండడం విశేషం. అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 1099.99 డాలర్లు (దాదాపుగా రూ.93,330) ఉండగా, భారత్‌లో రూ.1,09,999 ప్రారంభ ధరకు ఈ ఫోన్‌ను అందిస్తున్నారు.
ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,09,999 ఉండగా, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,21,999గా ఉంది. గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించారు. అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ ఆఫర్ కింద పలు బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌పై రూ.12వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా పొందవచ్చు.