మంగళవారం 26 మే 2020
Science-technology - Feb 15, 2020 , 16:06:02

భారత్‌లో గెలాక్సీ ఎస్‌20 సిరీస్‌ ఫోన్ల ధరలు ఇవే..!

భారత్‌లో గెలాక్సీ ఎస్‌20 సిరీస్‌ ఫోన్ల ధరలు ఇవే..!

శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో ఇటీవలే గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్లస్‌, ఎస్‌20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా భారత్‌లో ఈ ఫోన్ల ధరలను శాంసంగ్‌ ప్రకటించింది. ఈ క్రమంలో ఈ ఫోన్లకు ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. ఇక ఈ మూడు ఫోన్ల ధరలు భారత్‌లో ఈ విధంగా ఉన్నాయి. 

  • శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 4జీ - 8జీబీ + 128జీబీ - ధర రూ.66,999
  • శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ప్లస్‌ 4జీ - 8జీబీ + 128జీబీ - ధర రూ.73,999
  • శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జీ - 12జీబీ + 128జీబీ - ధర రూ.92,999

ఈ ఫోన్లను శాంసంగ్‌ భారత్‌లో మార్చి 6వ తేదీ నుంచి విక్రయించనుంది. ఈ సందర్భంగా పలు లాంచింగ్‌ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. గెలాక్సీ ఎస్‌20 ప్లస్‌, ఎస్‌20 అల్ట్రా ఫోన్లను ప్రీబుకింగ్‌ చేసుకుంటే రూ.1999 ధరకే గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌ ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అదే గెలాక్సీ ఎస్‌20 ఫోన్‌ను ప్రీబుకింగ్‌ చేసుకుంటే సదరు బడ్స్‌ను రూ.2,999 ధరకు పొందవచ్చు. ఈ ఫోన్లపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే రూ.48,100 వరకు గరిష్ట ఎక్స్‌ఛేంజ్‌ ధరను పొందవచ్చు. ఇక రూ.1,999 చెల్లిస్తే ఫోన్లకు యాక్సిడెంటల్‌, లిక్విడ్‌ డ్యామేజ్‌ల ప్రొటెక్షన్‌ లభిస్తుంది. 


logo