KC Venugopal | మోదీ రెండు స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు..?
KC Venugopal | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో ఓడిపోతాననే భయంతోనే రాహుల్‌గాంధీ వాయనాడ్‌కు పారిపోయారని, ఈ ఎన్నికల్లో వాయనాడ్‌లో ఓడిపోతాననే భయంతో రాయ్‌బరేలీకి పారిపోయారని విమర్శిస్తున్నారు.
KC Venugopal : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతుండటంపై మీడియా ప్రశ్నించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో ఓడిపోతాననే భయంతోనే రాహుల్‌గాంధీ వాయనాడ్‌కు పారిపోయారని, ఈ ఎన్నికల్లో వాయనాడ్‌లో ఓడిపోతాననే భయంతో రాయ్‌బరేలీకి పారిపోయారని విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు కేసీ వేణుగోపాల్ ముందు ప్రస్తావించగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది పార్టీ నిర్ణయమని, పార్టీకి నమ్మకస్తుడైన సైనికుడు పార్టీ నిర్ణయాన్ని శిరసావహించడం ఆయన బాధ్యతని కేసీ వేణుగోపాల్ అన్నారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఏమన్నా తప్పా, మాజీ ప్రధాని అటల్‌బిహరీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఒకటి మించిన నియోజకవర్గాల్లో పోటీ చేశారుగా అని గుర్తుచేశారు.
వాజ్‌పేయి మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని మీ మీడియా ప్రశ్నించిందా..? అని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. 2014లో ప్రధాని మోదీ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు ప్రశ్నించారా..? అని అడిగారు. రాహుల్‌గాంధీ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించగానే మీ మీడియా అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఏ సమస్య లేనట్టు రాహుల్‌గాంధీ మీదనే మీ డిబేట్లు దేనికని మండిపడ్డారు.
ప్రతిపక్ష కూటమి దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా విడదీసే ప్రయత్నం చేస్తున్నదన్న మోదీ అడ్డగోలు ఆరోపణలపై మీ మీడియా ఎందుకు డిబేట్ పెట్టదని కేసీ వేణుగోపాల్ నిలదీశారు. దేశంలో నిరుద్యోగం మీద, మహిళలపై బీజేపీ నేతలు చేస్తున్న అకృత్యాల మీద, రోజురోజుకు పెరిగిపోతున్న ధరల మీద డిబేట్లు పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రావడం లేదు..? అని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

