న్యూఢిల్లీ : జూన్ 6న భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ (Samsung Galaxy F54 5G) లాంఛ్ కానుంది. అప్‌కమింగ్ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ కీలక ఫీచర్లను కంపెనీ రివీల్ చేసింది. మే 30న ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కాంపై ఈ డివైజ్ ప్రీ రిజర్వ్ కోసం అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు రూ. 999 చెల్లించి ఈ డివైజ్‌ను ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు. ఆపై ప్రీ ఆర్డర్ సమయంలో రూ. 2000 వరకూ బెనిఫిట్స్ పొందే వెసులుబాటు ఉంది. న్యూ గెలాక్సీ ఎఫ్54 యూజర్లకు అద్భుతమైన కెమెరా ఎక్స్పీరియన్స్ అందిస్తుందని శాంసంగ్ వెల్లడించింది.
శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఓఐఎస్ సపోర్ట్‌తో 108 ఎంపీ కెమెరాను కలిగిఉంటుందని తెలిపింది. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా స్మూత్ వీడియోలను షూట్ చేసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌తో ప్రవేశపెట్టిన న్యూ ఆస్ట్రాల్యాప్స్ ఫీచర్‌తో అప్‌కమింగ్ 5జీ ఫోన్ కస్టమర్ల ముందుకు రానుందని శాంసంగ్ తెలిపింది. ఇక గెలాక్సీ ఎఫ్54 5జీ ఫ్రంట్ కెమెరాతో తక్కువ లైటింగ్ కండిషన్స్‌లోనూ మెరుగైన సెల్ఫీలు తీసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇక ఇతర కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే 16 వైవిధ్యభరితమైన ఇన్‌బిల్ట్ లెన్స్ ఎఫెక్ట్స్‌తో కూడిన ఫన్ మోడ్ ఆకట్టుకుంటుందని తెలిపింది.
సింగిల్ షాట్‌తో నాలుగు వీడియోలు, నాలుగు ఫొటోల వరకూ క్యాప్చర్ చేసే వెసులుబాటు కలిగిన సింగిల్ టేక్ ఫీచర్‌తో ఈ హాట్ డివైజ్ యూజర్ల ముందుకు రానుంది. కెమెరా వెనుక ఉండే ఏఐ ఇంజన్స్‌తో ఈ ఫీచర్ ఆకట్టుకుంటుంది. అప్‌కమింగ్ శాంసంగ్ ఫోన్ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు వస్తుందని లేటెస్ట్ లీక్స్ వెల్లడించాయి. 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More