న్యూయార్క్ : ఏడాది కిందట నీట మునిగిన ఐఫోన్ 12 (1phone 12) వర్కింగ్ కండిషన్లో బయటపడింది. యాపిల్ ఐఫోన్లు నెలల తరబడి నీటిలో నానిన ఎన్నో ఉదంతాలు కనిపించాయి. అయితే ఏడాది పైగా నీటిలో ఉన్నా ఐఫోన్ చెక్కుచెదరదని తాజా ఘటన నిరూపించింది. అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్లో ఓ స్కూబా క్లబ్ ఏడాదిగా నీటి కింద ఉన్న ఐఫోన్‌ను గుర్తించింది. అయితే ఇప్పటికీ ఐఫోన్ ఆన్ కావడం, ఎలాంటి ఇష్యూలు తలెత్తకుండా పనిచేయడం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
మెందోటా లేక్‌లో క్లీనింగ్ ఆపరేషన్స్ చేపట్టే స్కూబా క్లబ్ అండర్ వాటర్ ఆపరేషన్స్ సందర్భంగా ఇప్పటికే పలు మొబైల్ పోన్లను బయటకు తీసుకువచ్చింది. సహజంగా ఈ ఫోన్లన్నీ నీటి నుంచి బయటకు తీసిన తర్వాత పనిచేయడం నిలిచిపోతాయి. వాటిని చార్జింగ్ చేసేందుకు ప్రయత్నించినా అవి పనిచేసే పరిస్ధితిలో ఉండవు. అయితే ఇటీవల లభ్యమైన ఐఫోన్ 12 యధావిధిగా పనిచేయడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఐఫోన్ 12ను చార్జింగ్ చేసేందుకు ప్రయత్నించగా స్క్రీన్ లైట్ ఆన్ కావడం తమకు ఆశ్చర్యానికి గురిచేసిందని ఫోర్ లేక్స్ స్కూబా క్లబ్ ప్రెసిడెంట్ ఎలెన్ ఎవన్స్ చెప్పుకొచ్చారు. ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా ఐఫోన్ యజమానిని ఎల్లీ ఇసెన్బర్గ్గా గుర్తించారు. 2022 సమ్మర్లో ఫ్రెండ్స్‌తో బోటింగ్ చేస్తున్న సమయంలో ఐఫోన్ పొరపాటున నీటిలో పడిపోయిందని ఎల్లీ ఇసెన్‌బర్గ్ గుర్తు చేసుకున్నారు. ఎల్లీ విస్కిన్సన్-మాడిసన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
Read More