IPhone 16 Pro | భారీ డిస్ప్లే, న్యూ కెమెరాలతో రానున్న ఐఫోన్ 16 ప్రొ మోడల్స్
ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌పై టెక్ ప్రపంచంలో మళ్లీ హాట్ డిబేట్ ఊపందుకుంది. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ (IPhone 16 Pro) భారీ డిస్ప్లే సైజ్‌లతో పాటు న్యూ కెమెరాలతో ఆకట్టుకుంటాయని వెల్లడైంది.
న్యూఢిల్లీ : ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌పై టెక్ ప్రపంచంలో మళ్లీ హాట్ డిబేట్ ఊపందుకుంది. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ (IPhone 16 Pro) భారీ డిస్ప్లే సైజ్‌లతో పాటు న్యూ కెమెరాలతో ఆకట్టుకుంటాయని వెల్లడైంది. వచ్చే ఏడాది కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 16 మోడల్స్ గురించి వారానికో లీక్ ప్రచారంలోకి వస్తోంది. ఐఫోన్ 16 ప్రొ , ప్రొ మ్యాక్స్ మోడల్స్ డిస్ప్లే ఇంతకుమునుపెన్నడూ లేని రీతిలో భారీ డిస్ప్లేను కలిగిఉంటాయని బ్లూమ్‌బర్గ్ మార్క్ గుర్మన్ వెల్లడించారు.
ఐఫోన్ 14 ప్రొ వెర్షన్ 6.1 ఇంచ్ స్క్రీన్ కలిగిఉండగా ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ 6.7 ఇంచ్ స్క్రీన్‌ను కలిగిఉంది. ఇక ఐఫోన్ 15 సిరీస్ పాత డిస్ప్లే సైజ్‌లను కలిగిఉంటుందని ఐఫోన్ 16 సిరీస్ భారీ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొస్తుందని లీక్‌లు వెల్లడించాయి. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ వరుసగా 6.3 ఇంచ్, 6.9 ఇంచ్ డిస్ప్లే సైజ్‌లతో ఆకట్టుకుంటాయని టెక్ నిపుణులు మింగ్-చి కు అంచనా వేశారు. ఐఫోన్ 16 డివైజ్‌లు ఓఎల్ఈడీ డిస్ప్లేతో రానున్నాయని చెబుతున్నారు.
ఇక ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ వెనుకభాగంలో న్యూ సోనీ ఐఎంఎక్స్903 కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, డిజిటల్ చాట్స్టేషన్తో పాటు మరో టిప్‌స్టర్ ష్రింప్యాపిల్ ప్రొ వెల్లడించింది. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ వెనుకభాగంలో న్యూ పెరిస్కోప్ కెమెరా ఉంటుందని చెబుతున్నారు. ఈ పెరిస్కోప్ లెన్స్ 6x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇక ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ కానుండగా, ఐఫోన్ 16 సిరీస్ వచ్చే ఏడాది మార్కెట్లో సందడి చేయనుంది.
Read More
Best Smart Phones | రూ.10 వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

