Samsung Galaxy F36 5G | ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు మిడ్ రేంజ్ ఫోన్లలోనే ఫ్లాగ్ షిప్ ఫీచర్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. యూజర్లు తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను వాడుకుంటున్నారు. చాలా మంది ఇలాంటి ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇదే కోవలో శాంసంగ్ కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ధర తక్కువే అయినప్పటికీ ఫీచర్లు మాత్రం అదిరిపోయే విధంగా ఉన్నాయి. గెలాక్సీ ఎఫ్36 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో శాంసంగ్ లాంచ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 6.7 ఇంచుల ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్లో ఉండగా దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఫోన్లో శాంసంగ్‌కు చెందిన ఎగ్జినోస్ 1380 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు గాను 6 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్‌కు గాను గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.
ఈ ఫోన్‌ను చాలా పలుచగా తక్కువ మందంతో తయారు చేశారు. కేవలం 7.7 ఎంఎం మందం మాత్రమే కలిగి ఉంటుంది. అందువల్ల ఫోన్ చాలా ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అయితే బాక్స్‌తోపాటు చార్జర్‌ను మాత్రం అందించడం లేదు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో 2 టీబీ వరకు కెపాసిటీ ఉన్న మైక్రో ఎస్డీ కార్డును వేసుకుని మెమొరీని పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు సైతం ఈ ఫోన్లో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జి స్మార్ట్ ఫోన్‌ను కోరల్ రెడ్, లక్స్ వయోలెట్, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,499 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లో జూలై 29వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ కింద ఈ ఫోన్‌పై అన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో రూ.1500 తగ్గింపు ధరకే ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.