Samsung Galaxy A17 5G | శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎ సిరీస్‌లో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎ17 5జి పేరిట ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. గతేడాది వచ్చిన ఎ16 5జి ఫోన్‌కు కొనసాగింపుగా ఎ17 5జి ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించడంతోపాటు ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్న్ అందిస్తున్నారు. దీనికి గాను 6 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. కనుక డిస్ప్లే చాలా దృఢంగా ఉంటుంది. అలాగే వెనుక భాగాన్ని గ్లాస్ ఫైబర్‌తో రూపొందించారు. కనుక వెనుక భాగం కూడా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అయితే చార్జర్ బాక్స్‌తో లభించదు. ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో వచ్చిన ఎ16 5జి ఫోన్ కన్నా ఎ17 5జి ఫోన్‌ను మరింత పలుచగా ఉండేలా రూపొందించారు. కనుక ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. అలాగే కెమెరా డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది.
ఈ ఫోన్‌ను 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను అమర్చారు. రెండు సిమ్ కార్డులు లేదా ఒక సిమ్ కార్డు, ఒక మెమొరీ కార్డును వేసుకునే సదుపాయం మాత్రమే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో అమర్చారు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. ఫోన్ కింది వైపు లౌడ్ స్పీకర్లు ఉంటాయి. ఐపీ 54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను కూడా అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎ17 5జి స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,499గా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.23,499గా ఉంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లు, ఇతర ఆన్లైన్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పరిమిత కాల ఆఫర్‌గా అందిస్తున్నారు.