Jio Book | దీపావళికల్లా మార్కెట్లోకి జియోబుక్.. లోబడ్జెట్ ల్యాపీ?!
Jio Book | అంతా ఊహించినట్లు జియో లోబడ్జెట్ లాప్టాప్ వచ్చేసింది. జియోబుక్ అనే పేరుతో వస్తున్న ల్యాపీ రూ.19,500లకు లభ్యం కానున్నది.
Jio Book | రిలయన్స్ జియో తాజాగా తీపి కబురందించింది. మంగళవారం తన తొలి లో బడ్జెట్ లాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. సాధారణ ప్రజలకు దీపావళి తర్వాత అందుబాటులోకి రానున్నదని వినికిడి. ప్రస్తుతానికి ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం – GeM) పోర్టల్‌లో అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు విక్రయించడానికి మాత్రమే ` జీఈఎం ( GeM )`లో అందుబాటులో ఉంచారని సమాచారం. `జియో బుక్` పేరుతో ఆవిష్కరించిన లాప్టాప్ ధర రూ.19,500గా నిర్ణయించారు. 2జీబీ రామ్ కెపాసిటీతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో జియో బుక్ డిస్ప్లే చేశారు.
జియో బుక్ లాప్టాప్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 32 జీబీ. 6-8 గంటల బ్యాటరీ బ్యాకప్ సౌకర్యం కల్పిస్తోంది. 11.6 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ బ్యాక్లిట్ యాంటీ గ్లేర్ స్క్రీన్‌తో అందుబాటులోకి వస్తున్నది. ఏడాది పాటు బ్రాండ్ వారంటీ అందిస్తున్నది. యూఎస్బీ 2.0 పోర్ట్, యూఎస్మా 3.0 పోర్ట్, హెచ్డీఎంఐ పోర్ట్, మైక్రో ఎస్డీ స్లాట్ కూడా లభిస్తుంది.
జియోబుక్ లాప్టాప్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 665 ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. జియో ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే జియో బుక్ పని చేస్తుంది. 802.11 ఏసీ వై-ఫై కనెక్టివిటీ ఫెసిలిటీ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.2తో బ్లూటూత్ కనెక్టివిటీ, 4జీ మొబైల్ బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంటర్నల్ స్పీకర్లు, డ్యుయల్ మైక్రో ఫోన్లు కూడా ఉంటాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

