 
                                                            Reliance Jio Youth Offer | రిలయన్స్ జియో తన యూత్ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 18 నెలల పాటు గూగుల్ జెమిని ఏఐ ప్రొ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు గాను టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌తో తాము భాగస్వామ్యం అయ్యామని రిలయన్స్ జియో వెల్లడించింది. ఈ క్రమంలోనే తమ యూత్ కస్టమర్లకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలియజేసింది. జెమిని ఏఐ ప్రొ ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా వాడుకోవచ్చని తెలిపింది. దీని వల్ల భారతీయ యువతకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని, గూగుల్‌కు చెందిన అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉచితంగా పొందే వీలు కలుగుతుందని జియో ప్రతినిధులు తెలిపారు.
కాగా గూగుల్ జెమిని ఏఐ ప్రొ ప్లాన్ ను ఈ ఆఫర్లో భాగంగా 18 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. దీని విలువ రూ.35,100. ఆ మేర జియోకు చెందిన యువ కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రిలయన్స్ జియో కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. కాగా ప్రముఖ టెలికం దిగ్గజ సంస్థ ఎయిర్ టెల్ ఇదివరకే పర్ప్లెక్సిటీతో భాగస్వామ్యం అయి ఎయిర్టెల్ వినియోగదారులకు 1 ఏడాదిపాటు పర్ప్లెక్సిటీ ప్రొ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే జియో కూడా ఈ ఆఫర్‌ను ప్రారంభించింది. కానీ జియో అందిస్తున్న ఈ ఆఫర్ కేవలం యువతకు మాత్రమే అందుబాటులో ఉండడం విశేషం.
ఇక జియో అందిస్తున్న ఈ ఆఫర్లో భాగంగా యువ కస్టమర్లు 18 నెలల పాటు గూగుల్ జెమిని ఏఐ ప్రొ ప్లాన్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఈ ఆఫర్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఆఫర్‌ను పొందేందుకు అర్హులు. జియోకు చెందిన 5జి అన్లిమిటెడ్ ప్లాన్లను వాడుతున్న యువ కస్టమర్లు ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. రూ.349 లేదా అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న రిలయన్స్ జియో యువ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందుకు గాను ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. వినియోగదారులు తమ ఫోన్లో ఉన్న మై జియో యాప్‌లోకి వెళ్లి అందులో హోమ్ పేజ్‌లో పై భాగంలో ఉండే క్లెయిమ్ నౌ అనే బ్యానర్‌పై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చే పేజీలో వివరాలను నమోదు చేసి ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
దేశంలో ఉన్న విద్యార్థులు, పరిశోధకులు, యువ ప్రొఫెషనల్స్‌కు అధునాతన ఏఐ టూల్స్‌ను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతోనే ఈ ఆఫర్‌ను ప్రారంభించామని జియో తెలిజేసింది. తమ యువ కస్టమర్లు జెమిని ఏఐ ప్రొ ప్లాన్ ద్వారా అద్భుతమైన ప్రీమియం ఫీచర్లను పొందవచ్చని స్పష్టం చేసింది. దీంట్లో భాగంగా గూగుల్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. కోడింగ్, రీజనింగ్, ఇతర క్రియేటివ్ పనుల కోసం ఈ ఏఐ టూల్స్ ఎంతగానో పనిచేస్తాయి. ఈ ఆఫర్లో భాగంగా 18 నెలల పాటు ఉచితంగా 2 టీబీ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చు. దీని ద్వారా గూగుల్ ఫొటోస్, డ్రైవ్, జీమెయిల్ వంటి యాప్స్‌కు మరింత స్టోరేజ్ పెరుగుతుంది. ఈ ఏఐ టూల్స్‌లో భాగంగా గూగుల్‌కు చెందిన వియో 3.1, నానో బనానా వంటి ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేషన్ టూల్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ప్రతి నెల 1000 ఏఐ క్రెడిట్స్‌ను కూడా ఆఫర్ కాలపరిమితి ఉన్నంత వరకు ఉచితంగా అందిస్తారు. ఇలా ఈ ఆఫర్ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని రిలయన్స్ జియోకు చెందిన ప్రతినిధులు తెలిపారు.
 
                            