శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Science-technology - Mar 10, 2020 , 10:01:36

350జీబీ డేటాతో జియో కొత్త ప్లాన్‌..!

350జీబీ డేటాతో జియో కొత్త ప్లాన్‌..!

టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఓ నూతన ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రూ.4,999 పేరిట ఓ లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ను జియో లాంచ్‌ చేసింది. 2017లో ఈ ప్లాన్‌ను జియో ప్రవేశపెట్టినా.. ఆ తరువాత ఈ ప్లాన్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఇదే ప్లాన్‌ను జియో మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఇక ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 350జీబీ డేటా వస్తుంది. అలాగే రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 12వేల నిమిషాల నాన్‌ జియో కాల్స్‌ లభిస్తాయి. ఈ ప్లాన్‌ వాలిడిటీని 360 రోజులుగా నిర్ణయించారు. 


logo