realme P4 Power : ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ కెపాసిటీ ఉండే ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ తయారీ కంపెనీలు కూడా బిగ్ బ్యాటరీ ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇప్పటికే వన్ ప్లస్ సంస్థ ఏకంగా 7,400 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ కలిగిన వన్ ప్లస్ 15ఆర్ అనే మొబైల్ ను లాంచ్ చేసింది. కొన్ని ఇతర కంపెనీలు కూడా దాదాపు ఇదే కెపాసిటీ ఉన్న మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
ఇప్పుడు వీటిని మించే మరో ఫోన్ ను చైనాకు చెందిన రియల్ మీ సంస్థ మార్కెట్లోకి తీసుకురానుంది. దాదాపు 10,000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో కొత్త ఫోన్ ను ఈ నెలలోనే దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్ మీ పీ4 పవర్ పేరుతో కొత్త ఫోన్ ను జనవరి 29న విడుదల చేయనుంది. ఆ రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు ఈ ఫోన్.. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్లాగ్ షిప్ ఫోన్. దీని ధర దాదాపు రూ.35,000 పైనే ఉండొచ్చని అంచనా. ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 32.5 గంటలపాటు యూట్యూబ్ వీడియో చూడొచ్చు. అలాగే 185.7 గంటలపాటు సంగీతం, 72.3 గంటలపాటు కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇది 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 4డీ కర్వుడ్ స్క్రీన్, 1.5 కే రిజల్యూషన్, 6.78 అంగుళాల డిస్ ప్లే, 219 గ్రాముల బరువు, ప్లగ్ అండ్ ప్లే, రివర్స్ ఛార్జింగ్, మీడియాటెక్ డెమెన్సిటీ 7,400 అల్ట్రా ప్రాసెసర్, 12జీబీ+256జీబీ స్టోరేజ్, 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా (50 ఎంపీ మెయిన్ కెమెరా+ఓఐఎస్+8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 16 విత్ రియల్ మీ యుఐ 7.0 ఓఎస్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి.