న్యూఢిల్లీ : రియల్‌మి జీటీ 2 ప్రొ లాంఛ్ డేట్‌ను కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 20న జీటీ 2 సిరీస్‌ను లాంఛ్ చేసేందుకు రియల్‌మి సన్నాహాలు చేపట్టింది. హైఎండ్ మోడల్లో రియల్‌మి జీటీ 2 ప్రొ తొలి 1టీబీ స్టోరేజ్ కెపాసిటీతో కస్టమర్ల ముందుకు రానుందని, రియల్‌మి జీటీ 2 ప్రొ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను వాడుతోంది. ఇక లీకయిన వివరాల ప్రకారం 125డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్న తొలి రియల్‌మి ఫోన్ జీటీ 2 ప్రొ కాగా, రియర్ కెమెరా సిస్టంలో సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్‌ను వాడుతున్న తొలి రియర్మి ఫోన్ కూడా ఇదేనని చెబుతున్నారు.
రియల్‌మి జీటీ2 ప్రొ విడుదలైతే మోటొరోలా మోటో ఎడ్జ్ ఎక్స్30, షియోమి 12కు దీటైన పోటీ ఇవ్వనుంది. రియల్‌మి జీటీ 2 ప్రొ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు టాప్ లెవెల్ కెమెరాలతో ఇది కస్టమర్ల ముందుకు రానుందని ప్రచారం సాగుతోంది. హై రిఫ్రెష్ రేట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, మెరుగైన కెమెరాల వంటి అడ్వాన్డ్స్ ఫీచర్లతో జీటీ 2 ప్రొ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.