న్యూఢిల్లీ : పోకో ఎం4 ప్రొ 5జీ మంగళవారం గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల లాంఛ్ అయిన రెడ్మి నో్ట్11 డిజైన్‌ను పోలిఉంది.ఇక పోకో ఎం4 ప్రొ 5జీ గ్రే, యల్లో కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. పోకో ఎం4 ప్రొ 5జీ 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8 మెగాపిక్సెల్ సెకడంరీ సెన్సర్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ 19,600 కాగా ఇది భారత్‌లో ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.