Oppo | భారత్‌లో త్వరలో రెనో 8 సిరీస్ లాంఛ్..ధర ఎంతంటే!
ఒప్పో రెనో 8 సిరీస్ భారత్‌లో త్వరలో లాంఛ్ కానుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఒప్పో 8, ఒప్పో 8 ప్రొతో న్యూ సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది.
న్యూఢిల్లీ : ఒప్పో రెనో 8 సిరీస్ భారత్‌లో త్వరలో లాంఛ్ కానుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఒప్పో 8, ఒప్పో 8 ప్రొతో న్యూ సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది. చైనాలో అందుబాటులో ఉన్న ఒప్పో రెనో 8ప్రొ+ ఇండియా లాంఛ్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. భారత్‌లో ఒప్పో రెనో 7 సిరీస్ ఎంట్రీ ఇచ్చిన నాలుగు నెలల తర్వాత రెనో 8 సిరీస్ లాంఛ్ కానుంది.
ఒప్పో రెనో 8 సిరీస్ లాంఛ్ డేట్‌ను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. లాంఛ్‌కు ముందు తన అధికారిక వెబ్సైట్లో ఒప్పో రెనో 8 సిరీస్ కోసం మైక్రోసైట్‌ను ఏర్పాటు చేసింది. ఇక ఒప్పో రెనో 8ప్రొలో మెరుగైన వీడియో, స్టిల్ ఇమేజ్‌ల కోసం మారిసిలికాన్ ఎక్స్ చిప్‌ను వాడుతున్నట్టు కంపెనీ తెలిపింది. చైనాలో అందుబాటులో ఉన్న ఒప్పో రెనో 8, రెనో 8 ప్రొ స్పెసిఫికేషన్స్‌ను భారత్ మోడల్స్‌లోనూ కొనసాగిస్తారు.
ఒప్పో రెనో 8 ఫీచర్ల విషయానికి వస్తే 6.43 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ఎస్ఓసీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 80డబ్ల్యూ సూపర్ ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. రెగ్యులర్ వెర్షన్లో ప్రొప్రైటరీ మారిసిలికాన్ ఎక్స్ చిప్ అందుబాటులో ఉండదని భావిస్తున్నారు. ఇక రెనో 8 ప్రొ మోడల్ 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ ఈ4 డిస్ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ ఎస్ఓసీ చిప్సెట్, 80డబ్ల్యూ సూపర్ ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఒప్పో 8 రూ 30,000కు అందుబాటులో ఉండనుండగా, ఒప్పో 8 ప్రొ రూ 35,000 నుంచి రూ 40,000 మధ్య లభిస్తుందని అంచనా.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

