న్యూఢిల్లీ : ఒప్పో రెనో 7 సిరీస్ లాంఛ్ తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన రాకున్నా ఈ స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్స్‌పై ఓ రిపోర్ట్ వెల్లడైంది. రానున్న ఒప్పో కెమెరా-ఫోకస్డ్ పోన్ సిరీస్‌లో రెనో 7, రెనో 7 ప్రొ, రెనో 7 ఎస్ఈ ఫీచర్లపై ఓ స్పానిష్ వెబ్సైట్ పలు వివరాలు తెలిపింది. ఒప్పో రెనో 7, ఒప్పో రెనో 7 ప్రొ ఫుల్ హెచ్డి రిజల్యూషన్‌తో 6.5 ఇంచ్‌ల డిస్ప్లేను కలిగిఉంటాయని, రెండు ఫోన్లు 65డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తాయని వెల్లడించింది.
ఇక రెండు రెనో 7 ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11పై పనిచేస్తాయి. ఇక రెనో 7 మీడియాటెక్ డైమెన్షిటీ 1200 ప్రాసెసర్ వాడుతుండా, రెనో 7 ప్రొ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను వాడే అవకాశం ఉందని ఈ వెబ్సైట్ పేర్కొంది. రెనో 7 సిరీస్‌లో 7 ప్రొ అత్యంత పవర్ఫుల్ మోడల్‌గా చెబుతున్నారు. ఇక కెమెరాలు సైతం రెండు ఫోన్లలో భిన్నంగా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఇక రెనో 7 స్మార్ట్‌ఫోన్ రూ 40,900 నుంచి అందుబాటులో ఉంఉందని , రెనో 7 ప్రొ ఎంట్రీ మోడల్ రూ 50,300, రెనో 7 ఎస్ఈ రూ 31,600 ఉండవచ్చని వీబో రిపోర్ట్ అంచనా వేసింది.